ప్రతిరైతుకూ బీమా వచ్చే వరకూ పోరాడతాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రతిరైతుకూ బీమా వచ్చే వరకూ పోరాడతాం

ప్రతిరైతుకూ బీమా వచ్చే వరకూ పోరాడతాం

Written By news on Thursday, February 4, 2016 | 2/04/2016


ప్రతి రైతుకూ పంట బీమా అందే వరకూ వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ  పోరాడుతుందని.. కమలాపురం  ఎమ్మెల్యే , వైఎస్సార్‌సీపీ నేత రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కమలాపురం పరిధిలో ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన కొంత మంది రైతులకు 2012 సంవత్సరానికి గానూ పంట బీమా అందలేదు. దీంతో రైతులు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని కలిసి విషయం వివరించారు.
ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన ప్రతి రైతుకూ పంట బీమా వచ్చేంతవరకూ పోరాడతామన్నారు. వీలైతే హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ కంపెనీ ఎదుట వంటావార్పు కార్యక్రమం చేసి ధర్నా నిర్వహిస్తామన్నారు
Share this article :

0 comments: