ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు నాతోనే టచ్‌లో ఉన్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు నాతోనే టచ్‌లో ఉన్నారు

ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు నాతోనే టచ్‌లో ఉన్నారు

Written By news on Tuesday, February 23, 2016 | 2/23/2016


ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు నాతోనే టచ్‌లో ఉన్నారువిలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పిన్నెల్లి
త్వరలోనే వైఎస్సార్ సీపీలో చేరతారు
మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే వెల్లడి

 
మాచర్ల: టీడీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కొద్ది నెలల్లోనే తన ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) వెల్లడించారు. వారంతా తనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు. సోమవారం కన్నెగంటి హనుమంతు వర్ధంతి సందర్భంగా మాచర్ల ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పీఆర్కే విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోవడంతో ఆందోళన చెంది, రాష్ట్రంలో మైండ్‌గేమ్ ఆడుతోందని, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారంటూ ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మంత్రి పదవి కోసమో లేక అధికార వ్యామోహంతో ఒకరిద్దరు చంద్రబాబుకు మద్దతు పలుకుతారేమో కాని ప్రజల మద్దతు ఇప్పటి కీ వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికే ఉందని పేర్కొన్నారు. ఇది చూసి అధికార పార్టీ ఎమ్మెల్యే కొందరు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. డ్వాక్రా మహిళలు, రైతులు, నిరుద్యోగులు చంద్రబాబును నమ్మి నిలువునా మునిగారని, అలాంటిది ఆయన్ను నమ్ముకొని టీడీపీలో ఎవరు చేరతారని ప్రశ్నించారు.

ఒకే ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేతో ప్రారంభమైన వైఎస్సార్ సీసీ ఇప్పుడు 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలతో ప్రజల సమస్యలపై నిత్యం పోరాటం చేస్తోందని చెప్పారు. ఇకనైనా తప్పుడు ప్రచారాలను మానుకొని ప్రజా సంక్షేమంపై ప్రభుత్వం ఆలోచన చేయాలని హితవు పలికారు. లేకపోతే టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Share this article :

0 comments: