
ఎర్రగుంట్ల : దేనికి భయపడొద్దు, మీకు నేనున్నాను అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కౌన్సిలర్ దాసరి సూర్యనారాయణరెడ్డికి భరోసా ఇచ్చారు. గురువారం వైఎస్సార్ సీపీ నాయకుడు డాక్టరు సుధీర్‌రెడ్డి ఆధర్యంలో ఎంపీ వైఎస్ ఆవినాష్‌రెడ్డితో పాటు ఆయన ఎర్రగుంట్లలోని కౌన్సిలర్ దాసరి సూర్యనారాయణరెడ్డి ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ దాసరి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు తనపై అక్రమ కేసులు పెట్టారని వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు.
ఇందుకు జగన్ స్పందిస్తూ ఎలాంటి భయాందోళ నలు పడకండి అని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు పద్మనాభయ్య, నాగన్న, ఎరికల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు సత్యనారాయణరెడ్డి, ముస్తాఫా, ప్రతాప్‌లు కలసి మాట్లాడారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గంగా వెంకటశివారెడ్డి, గంగాకృష్ణారెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యులు అబ్దుల్‌గఫార్, నాగిరెడ్డి, వై.కోడూరు శ్రీరాములరెడ్డిలు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment