కర్నూలు: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని పార్నెపల్లి గ్రామం పార్నపల్లికి వెళ్లనున్నారు. వీరజవాన్ ముస్తాక్ అహ్మద్ అంత్యక్రియలకు వైఎస్ జగన్ హాజరుకానున్నారు. వీరజవాన్ ముస్తాక్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు.
ఇటీవల సియాచిన్ ఘటనలో వీర జవాను ముస్తాక్ అహ్మద్ అమరుడైన సంగతి తెలిసిందే. వీరజవాను భౌతిక కాయం ఆర్మీ ప్రత్యేక విమానంలో సోమవారం హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ సందర్భంగా ముస్తాక్ భౌతిక కాయానికి పలువురు నివాళులు ఆర్పించారు. ముస్తాక్ భౌతిక కాయాన్ని బేగం పేట నుంచి రోడ్డుమార్గం ద్వారా కర్నూలు జిల్లా నంద్యాలకు తరలించారు.
0 comments:
Post a Comment