బాబు వ్యాఖ్యలపై భగ్గు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు వ్యాఖ్యలపై భగ్గు

బాబు వ్యాఖ్యలపై భగ్గు

Written By news on Sunday, February 21, 2016 | 2/21/2016


బాబు వ్యాఖ్యలపై భగ్గు
దళితులను కించపరిచిన ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి
వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్
జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణుల నిరసన కార్యక్రమాలు
 అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు

 
 పట్నంబజారు(గుంటూరు) : ఉన్నతమైన పదవిలో ఉండి దళితులపై వివక్షాపూరిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. జిల్లా వ్యాప్తంగా శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్‌ల విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఇటీవల విజయవాడలో ‘ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా’ అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించిన విషయం విధితమే. ఈ వ్యాఖ్యలపై దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు.

 పార్టీ జిల్లా, నగర అధ్యక్షుల ఆధ్వర్యంలో..
పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలోని తహశీల్దారు కార్యాలయం వద్ద డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, బాబుజగ్జీవన్‌రామ్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గుంటూరులోని లాడ్జిసెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డిల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ముందుగా అరండల్‌పేటలోని నగర పార్టీ కార్యాలయం నుంచి నిరసన ప్రదర్శన నిర్వహించారు.

 మంగళగిరిలో..
మంగళగిరిలో పట్టణంలో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో అంబేడ్కర్, జగజ్జీవన్‌రామ్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసినివాళులు అర్పించారు. పార్టీ అనుబంధ విభాగాల నేతలు, ఎంపీపీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం జరిగింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నేతృత్వంలో పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ మాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.రాంబాబుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గంలో సమన్వయకర్త కత్తెర సురేష్‌కుమార్, ఇన్‌చార్జి కత్తెర హెనిక్రిస్టినా ఆధ్వర్యంలో, పెదకూరపాడు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త పాణెం హనిమిరెడ్డి ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. పొన్నూరు ఐలాండ్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ

 వేమూరు దళితవాడలో పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, మాచర్లలో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, వినుకొండ నియోజకవర్గంలో సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు క్షీరాభిషేకం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురజాల నియోజకవర్గంలో దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ళ మండలాల్లో పార్టీ మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. నరసరావుపేట పట్టణంలో ఎస్సీ విభాగం నేతల ఆధ్వర్యంలో ప్రత్తిపాడు బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కొత్తాచినప్పరెడ్డి, గుంటూరు రూరల్ జెట్పీటీసీ కొలకలూరి కోటేశ్వరరావుల ఆధ్వర్యంలో విగ్రహాలకు క్షీరాభిషేకాలు నిర్వహించి ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసన తెలిపారు.
Share this article :

0 comments: