చంద్రబాబుకు విలువలు లేవు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుకు విలువలు లేవు

చంద్రబాబుకు విలువలు లేవు

Written By news on Sunday, February 28, 2016 | 2/28/2016


చంద్రబాబుకు విలువలు లేవు
మాజీ ఎమ్మెల్యే
కాపు రామచంద్రారెడ్డి ధ్వజం


 రాయదుర్గం : ముఖ్యమంత్రి చంద్రబాబుకు విలువలు లేవని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చిన చంద్రబాబు.. గద్దెనెక్కిన తర్వాత వాటిని తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. ఇతరులకు శ్రీరంగనీతులు చెప్పడం, తాను మాత్రం వాటిని మరచి ప్రవర్తించడం బాబుకు అలవాటేనన్నారు.‘టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తోందని  హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో బాబు వాపోయారు.

ఒక పార్టీ నుంచి గెలిచిన వారిని రాజ్యాంగానికి విరుద్ధంగా కొనుగోలు చేయడం ధర్మమా అంటూ ప్రశ్నించారు. మరి అలాంటి వ్యక్తి ఏపీలో చేస్తున్నదేంట’ని నిలదీశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకోవడాన్ని ఏమనాలన్నారు.  రీచ్‌ల్లో దోచుకోవడం, దాచుకోవడం ముగిసిన తర్వాత ఇసుక విధానాన్ని మార్చడం శోచనీయమన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుల అంచనాలు పెంచి రూ.6వేల కోట్ల నిధులను ప్రభుత్వ కార్యదర్శుల సంతకాలు లేకుండా విడుదల చేయడం దోచుకోవడానికి కాదా అని ప్రశ్నించారు. అవినీతి బురదలో దొర్లుతూ మచ్చలేని నాయకుడిగా తనకు తాను కితాబిచ్చుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. కార్యక్రమంలో కణేకల్లు మాజీ ఎంపీపీ రాజగోపాల్ రెడ్డి, స్విస్ అధినేత గుంతకల్లు ఓంకారప్ప తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: