అరాచక పాలన అంతమొందిద్దాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అరాచక పాలన అంతమొందిద్దాం

అరాచక పాలన అంతమొందిద్దాం

Written By news on Saturday, February 20, 2016 | 2/20/2016


అరాచక పాలన అంతమొందిద్దాం
దోచుకుని దాచుకోవడమే టీడీపీ ప్రధాన అజెండా
సీఎం చంద్రబాబు నైతిక విలువల్లేని పాలన సాగిస్తున్నారు
బాపట్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ నేత బొత్స  

 

బాపట్ల దోచుకో.. దాచుకో అన్నదే ప్రధాన అజెండాగా రాష్ర్టంలో టీ డీపీ పాలన కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అరాచకపాలన అంతమొందే రోజులు దగ్గరపడ్డాయని ఆపార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. శుక్రవారం గుంటూరు జిల్లా బాపట్ల నియోజకర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అబద్దాలతో అందలం ఎక్కిన సీఎం చంద్రబాబు కనీస నైతిక విలువలులేని పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు టీడీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని, ప్రజాస్వామ్య విలువలకు భగ్నం కలిగించేలా జన్మభూమి కమిటీలు వేసి వారి ద్వారా పరిపాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అధైర్యపడొద్దని, ప్రజలకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఆరాచక పాలనను సమష్టిగాపారద్రోలాని పిలుపునిచ్చారు.


 రాజకీయాలకు అతీతమైన పాలన జగన్‌తోనే సాధ్యం..
జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీని దెబ్బతీయాలని టీడీపీ ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తోందనిఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా పని చేసి చూపిన వైఎస్సార్ పాలన మళ్లీ కొనసాగాలంటే జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ అధికారపార్టీ చేపట్టే ప్రజావ్యతిరేక విధానాలను తిప్పి కొట్టేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని సూచించారు. రాబోవుకాలంలో వైఎస్సార్ సీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని అప్పుడు ఒక్కొక్కటిగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చక్కబెట్టుకుందని సూచించారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కులాలలో రాజకీయ చిచ్చు రేకెత్తిస్తున్న చంద్రబాబు మాటలను ఎవరు నమ్మొద్దని పిలుపునిచ్చారు.

ఈవేదిక ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేద్దామని కోరారు. ఈ సమావేశంలో మాచర్ల, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మొహమ్మద్ ముస్తాఫా, పార్టీ నాయకులు లేళ్ళ అప్పిరెడ్డి, రావి వెంకటరమణ, మేరుగ నాగార్జున, అన్నాబత్తుని శివకుమార్, వరికూటి అమృతపాణి, కొత్తా చిన్నపరెడ్డి, బండారు సాయిబాబు, పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు నరాలశెట్టి ప్రకాశరరావు, దొంతిరెడ్డి సీతారామిరెడ్డి, కోకి రాఘవరెడ్డి, షేక్ బాజీ, జడ్పీటీసీలు వడ్డిముక్కల రత్నమణి, చిరసాని నారపరెడ్డి, గుంపులకన్నయ్య, ఎంపీపీ మాడ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా ఎమ్మెల్యే కోన రఘుపతి నాయకత్వంలో బాపట్ల భారీ ప్రదర్శన నిర్వహించారు.
Share this article :

0 comments: