వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై కొన్ని చానళ్లు తప్పుడు ప్రచారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై కొన్ని చానళ్లు తప్పుడు ప్రచారం

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై కొన్ని చానళ్లు తప్పుడు ప్రచారం

Written By news on Monday, February 22, 2016 | 2/22/2016


ఏపీలో వైఎస్సార్ సీపీ బలమైన శక్తి
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఉందని చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై కొన్ని చానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
టీడీపీ నేతలు పథకం ప్రకారమే మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. కొన్ని ఛానళ్లు టీడీపీకి వత్తాసు పలుకుతూ దుష్ప్రచారం చేయడంపై నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు.   తాము  ప్రజల నమ్మకాన్ని వొమ్ము చేయమన్నారు.
తమ  ప్రాణం ఉన్నంతవరకూ వైఎస్ఆర్ సీపీలోనే ఉంటామన్నారు. తాము పదవుకో, మరోదాని కోసమో ఆశపడలేదని నారాయణస్వామి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన ఘటన చంద్రబాబు నాయుడిది అన్నారు. చిత్తూరు జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని నారాయణస్వామి ధ్వజమెత్తారు.
Share this article :

0 comments: