కేంద్ర హోంమంత్రితో వైఎస్ జగన్ భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేంద్ర హోంమంత్రితో వైఎస్ జగన్ భేటీ

కేంద్ర హోంమంత్రితో వైఎస్ జగన్ భేటీ

Written By news on Wednesday, February 24, 2016 | 2/24/2016


కేంద్ర హోంమంత్రితో వైఎస్ జగన్ భేటీ
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా ప్రక్రియను వేగవంతం చేయాలని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేంద్ర హెంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరినట్టు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పార్టీ ఎంపీలతో పాటు ఆయన బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు రాజ్ నాథ్ ను కలిశారు. భేటీ ముగిసిన తర్వాత వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడుతూ... నిన్నటి అంశాలనే హోంమంత్రికి వివరించినట్టు తెలిపారు.

మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలయ్యేలా చూడాలని రాష్ట్రపతిని వైఎస్ జగన్ కోరారు. వివిధ అంశాలపై నాలుగు పేజీల వినతిపత్రం సమర్పించారు. వైఎస్ జగన్ వెంట లోక్‌ సభా పక్షనేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పివి మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు.
Share this article :

0 comments: