నెంబర్ వన్ ర్యాంక్ చంద్రబాబుదే: రోజా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నెంబర్ వన్ ర్యాంక్ చంద్రబాబుదే: రోజా

నెంబర్ వన్ ర్యాంక్ చంద్రబాబుదే: రోజా

Written By news on Friday, February 26, 2016 | 2/26/2016


నెంబర్ వన్ ర్యాంక్ చంద్రబాబుదే: రోజా
హైదరాబాద్ : 'నాకుండేదే క్యారెక్టర్. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పూ చేయలేదు. రాజకీయాల్లో విలువల కోసమే పాటుపడుతున్నా' అన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా తప్పుబట్టారు. క్యారెక్టర్ లేనివారి జాబితాలో నెంబర్ వన్ స్థానం చంద్రబాబుకే దక్కుతుందని ఆమె ఎద్దేవా చేశారు. లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రోజా మీడియా సమావేశంలో మాట్లాడారు.

చంద్రబాబు చెప్పేవి శ్రీరంగ నీతులు... చేసేవి నీతిమాలిన పనులని ఈ సందర్భంగా రోజా  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన 35 ఏళ్ల రాజకీయ జీవితమే తప్పుడు మార్గంలో మొదలైందని, పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి, ఈ రోజు చంద్రబాబు, ఆయన కుమారుడు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే చాలా ఉన్నాయన్నారు. రాజకీయాలను వ్యాపారంగా మార్చేసి ఎన్టీఆర్, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను కొన్న నీతిమాలిన క్యారెక్టర్ చంద్రబాబుదన్నారు.

'మావాళ్లు బ్రీఫ్ డ్ మీ అంటూ  ఎమ్మెల్యేలను కొని  ప్రపంచంలో తెలుగువాడి పరువును బజారును పడేసిన క్యారెక్టర్ చంద్రబాబుది. రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని మాయమాటలు చెప్పిన చరిత్ర బాబుది. 131 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీనే వైఎస్ జగన్ ను ఏమీ చేయలేకపోయింది. 33 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ ఏం చేస్తుంది?. పవన్ కళ్యాణ్, మోదీ కాళ్లు పట్టుకుని చంద్రబాబు గెలిచారు.

వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు నైతిక విలువల గురించి తెలుసుకోవాలి. ఎన్నికష్టాలు ఎదురైనా ప్రజల తరఫు పోరాడుతున్న నాయకుడు వైఎస్ జగన్. సోనియాగాంధీ, చంద్రబాబు కుమ్మక్కై 16 నెలలు జగన్ ను జైల్లో పెట్టారు. అయినా ఆయన ఎక్కడా భయపడలేదు. రాజకీయాల్లో విలువలు కాపాడాలనే వైఎస్ జగన్ పని చేస్తున్నారు. తప్పుడు దారిలో అధికారంలోకి రావాలని ఆయన ప్రయత్నించలేదు. నిజంగా చంద్రబాబుకు క్యారెక్టర్ ఉంటే ప్రజల కోసం పనిచేయాలి. తెలంగాణలో టీడీపీ...టీఆర్ ఎస్ లో విలీనమైంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. పక్క పార్టీలో ఉన్న నేతలను తీసుకుని పోయినంత మాత్రాన టీడీపీ బలపడదు' అన్నారు.

మేం రెడీ...మీరు రెడీనా?

మరోవైపు పయ్యావుల కేశవ్ సవాల్ ను తాము స్వీకరిస్తున్నామని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందిన 62మంది రాజీనామా చేస్తారని, మీరు రాజీనామా చేయండి, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామంటూ ఆమె ప్రతి సవాల్ విసిరారు. అసెంబ్లీ రద్దుకు డేట్ ఫిక్స్ చేయాలని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పయ్యావుల... వైఎస్ జగన్ ను విమర్శించే అర్హత లేదన్నారు. ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు వెళదామని, ఎవరి ఫేస్ వ్యాల్యు ఏంటో తేలుతుందని రోజా వ్యాఖ్యలు చేశారు.
Share this article :

0 comments: