లీడర్ టు లీడర్’ డైరీని ఆవిష్కరించిన వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లీడర్ టు లీడర్’ డైరీని ఆవిష్కరించిన వైఎస్ జగన్

లీడర్ టు లీడర్’ డైరీని ఆవిష్కరించిన వైఎస్ జగన్

Written By news on Thursday, February 18, 2016 | 2/18/2016


‘లీడర్ టు లీడర్’ డైరీని ఆవిష్కరించిన వైఎస్ జగన్డైరీని ఆవిష్కరిస్తున్న వైఎస్ జగన్. చిత్రంలో వేంపల్లి నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఎయిమ్ వ్యాప్తి అడ్వర్‌టైజింగ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూపొందించిన ‘లీడర్ టు లీడర్-2016 డైరీ’ని బుధవారం లోటస్‌పాండ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ వేంపల్లి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమరులైన అనంతరం 2010 సంవత్సరంలో తొలిసారిగా ఆయన జీవిత విశేషాలను ఫొటోలతో సహా పొందుపరుస్తూ ఈ డైరీని రూపొందించామని చెప్పారు.

అప్పటి నుంచి ప్రతి ఏటా డైరీని రూపొందిస్తున్నామని, నేటి వరకు ఒక్క ఏడాది మినహా ప్రతి సంవత్సరం జగన్ చేతుల మీదుగా ఈ డైరీ ఆవిష్కరణ జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు వైఎస్సార్ జీవిత విశేషాలు, జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను ప్రధానాంశంగా తీసుకుని డైరీని రూపొందించామని, కాని ఈ 2016  డైరీలో మహానేత జీవిత విశేషాలతో పాటు యువనేత జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర, రైతు భరోసా యాత్ర, రైతు పరామర్శ యాత్ర, ప్రజా సమస్యలపై చేసిన ధర్నాలు, దీక్షలు, వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేసిన దీక్షలు, మహానేత  తనయ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర, పరామర్శ యాత్ర తదితర విశేషాలన్నింటినీ ఫొటోలతో సహా పొందుపరిచామని తెలిపారు. మహానేత జీవిత విశేషాలు, ఆయన కుటుంబ సభ్యులు చేపట్టిన దీక్షలు, యాత్రలతో డైరీని రూపొందించడం తనకు లభించిన ఒక అదృష్టమైతే, ఆ డైరీని యువనేత చేతుల మీదుగా ఆవిష్కరింపజేయగలగడం మరో అదృష్టమని నిరంజన్‌రెడ్డి అన్నారు. ఎయిమ్ వ్యాప్తి సంస్థ క్రియేటివ్ డెరైక్టర్ నాగార్జున, ఉద్యోగులు బాషా, ఆలీ, రాజేష్‌లు ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this article :

0 comments: