అయినా టీడీపీలో చేరేందుకు ఏం ఉందని? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అయినా టీడీపీలో చేరేందుకు ఏం ఉందని?

అయినా టీడీపీలో చేరేందుకు ఏం ఉందని?

Written By news on Monday, February 22, 2016 | 2/22/2016


అయినా టీడీపీలో చేరేందుకు ఏం ఉందని?
విజయనగరం : పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని విజయనగరం జిల్లా కురుపాం వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె సోమవారం స్పష్టం చేశారు. రాజకీయాలు అంటే తెలియని రోజుల నుంచి తనకు వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే విపరీతమైన అభిమానమన్నారు. వైఎస్ఆర్ పై అభిమానంతో నియోజకవర్గ ప్రజలకు 20 వేల మెజార్టీతో తనను గెలిపించారని పుష్ప శ్రీవాణి గుర్తు చేశారు.
 
అటువంటిది పార్టీ, కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే ప్రయత్నం చేయనని ఆమె తెలిపారు. అయినా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఏముందని, ఆ పార్టీలోని వాళ్లే ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా తాను ధైర్యంగా వెళ్లగలుగుతున్నానని చెప్పారు. వైఎస్ఆర్ బొమ్మ పెట్టుకుని గెలిచినవాళ్లమని,  అలాంటిది తాను పార్టీ మారి టీడీపీలోకి వెళితే నియోజకవర్గ ప్రజలు చెప్పులు, చీపుళ్లతో తరిమి కొడతారన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందని, ఆయన దగ్గర కార్యకర్తగా అయినా పని చేస్తానే కానీ... వేరే పార్టీలోకి వెళ్లేది లేదన్నారు.

తాను పార్టీ మారడం లేదని సంజాయిజీ ఇచ్చుకోవడం బాధాకరమని పుష్ప శ్రీవాణి అన్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్...  ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, బేరసారాలు ఆడుతోందని వ్యాఖ్యానించిన టీడీపీ...ఇప్పుడు తాను చేస్తుందేమిటనీ ఆమె సూటిగా ప్రశ్నించారు. టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని మండిపడ్డారు. ఇక మీడియా అంటే ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేలా ఉండాలే కానీ... అబద్దాలు రాసి అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎక్కడ నిలదీస్తామో అన్న భయంతోనే టీడీపీ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందన్నారు.
సమస్యల నుంచి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తోందని  పుష్ప శ్రీవాణి ధ్వజమెత్తారు. తమ పార్టీ నేతను ఎప్పుడంటే అప్పుడు కలిసేందుకు అవకాశం ఉందని, అదే టీడీపీ అధ్యక్షుడిని కలవాలంటే పది రోజులు అయినా అపాయింట్ మెంట్ దొరకదని ఆ పార్టీ నేతలే తమ వద్ద వాపోతున్నారని ఆమె అన్నారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తమకు గౌరవం, ఆప్యాయత దొరుకుతున్నప్పుడు తామెందుకు టీడీపీలో చేరతామన్నారు.
Share this article :

0 comments: