చినబాబు, పెదబాబు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చినబాబు, పెదబాబు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు

చినబాబు, పెదబాబు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు

Written By news on Sunday, February 28, 2016 | 2/28/2016


'చినబాబు, పెదబాబు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు'
నెల్లూరు: విద్యుత్ ప్లాంట్ల కోసం కృషి చేసిన దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ను టీడీపీ ప్రభుత్వం విస్మరించడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సూచించారు. చినబాబు నారా లోకేష్.. పెదబాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటూ ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో పచ్చ చొక్కాల వారికే సంక్షేమ పథకాలు అందుతాయని మాజీ మంత్రి ప్రసన్నకుమార్ పేర్కొన్నారు.

పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేత ధ్వజమెత్తారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్తే సంతలో పశువుల్లా బేరమాడుతున్నారని కేసీఆర్‌ను దుమ్మెత్తిపోసిన సీఎం చంద్రబాబు, ఇప్పుడు ఏపీలో చేసిన దానికి ఏమి సమాధానం చెప్తారని ఇటీవల సూటిగా ప్రశ్నవేస్తే సీఎం వద్ద సమాధానమే లేకపోయింది
Share this article :

0 comments: