
రెండేళ్లలో చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిలేదని విమర్శించారు. స్థానిక ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ముఖ్యమంత్రి సత్తా బయటపడుతుందని అన్నారు. ఇసుక, మద్యం, భూదందా, పట్టిసీమ, గోదావరి పుష్కరాలు, కొత్త రాజధాని వంటి వాటిలో రూ.వేల కోట్లు దండుకున్నారని, ఆ డబ్బుతో సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీని అడ్డం పెట్టుకుని గెలిచిన వారు దమ్ముంటే పదవులకు రాజీనామాలు చేసి, టీడీపీ తరపున గెలవాలని చెవిరెడ్డి సవాల్ విసిరారు. ఆదరించి పిల్లనిచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచి పదవిని లాక్కున్న దుర్మార్గుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. తమ పార్టీని వదిలి వెళ్లిన వారికి భవిష్యత్తులో రాజకీయ సన్యాసం తప్పదని హెచ్చరించారు. కొనుగోలు చేయడం కోసం మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు డబ్బుతో వస్తే ఓటుకు నోటు’ కేసులో లాగా ఏసీబీకి పట్టించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు చెవిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
0 comments:
Post a Comment