వైఎస్ఆర్ కడప: అక్రమ కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట నడుస్తామని చెప్పారు. డబ్బులు, కాంట్రాక్టులిస్తామని చెప్పి ఎమ్మెల్యేలను కొంటున్నారని చెప్పారు.
ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం సిగ్గుచేటని వారు విమర్శించారు. రైల్వే బడ్జెట్ లో ఏపీకన్నా తెలంగాణకే ఎక్కువగా న్యాయం జరిగిందని అన్నారు. చంద్రబాబు కేంద్రంలో ఉండి కూడా ఏం చేయలేకపోయారని విమర్శించారు.
ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం సిగ్గుచేటని వారు విమర్శించారు. రైల్వే బడ్జెట్ లో ఏపీకన్నా తెలంగాణకే ఎక్కువగా న్యాయం జరిగిందని అన్నారు. చంద్రబాబు కేంద్రంలో ఉండి కూడా ఏం చేయలేకపోయారని విమర్శించారు.
0 comments:
Post a Comment