ఈసారైనా న్యాయం చేయండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈసారైనా న్యాయం చేయండి

ఈసారైనా న్యాయం చేయండి

Written By news on Monday, February 22, 2016 | 2/22/2016


ఈసారైనా న్యాయం చేయండి
న్యూఢిల్లీ :
రెండు రోజుల పర్యటన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ప్రధానంగా ఈసారి కేంద్ర బడ్జెట్‌తో పాటు రైల్వే బడ్జెట్‌లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన న్యాయం చేయాలని కోరేందుకు ఆయన వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీల అపాయింట్‌మెంట్లు కోరారు. ఈ పర్యటనలో వైఎస్ జగన్ వెంట ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు.

ఈసారి కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తగిన న్యాయం చేయాలని ఆయన కోరనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని గత ప్రభుత్వమే హామీ ఇచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చి కూడా రెండేళ్లు పూర్తయినా ఈ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం గురించి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరిస్తారు. అదేవిధంగా, కాపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, వాళ్ల మనోభావాలు వివరించి.. తగిన న్యాయం చేయాలని కోరనున్నారు. తునిలో జరిగిన ఆందోళన సందర్భంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరనున్నారు.
Share this article :

0 comments: