రూ.100 కోట్లు ఇచ్చినా వెళ్లం.. మేం వైఎస్ఆర్ సీపీతోనే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రూ.100 కోట్లు ఇచ్చినా వెళ్లం.. మేం వైఎస్ఆర్ సీపీతోనే

రూ.100 కోట్లు ఇచ్చినా వెళ్లం.. మేం వైఎస్ఆర్ సీపీతోనే

Written By news on Tuesday, March 29, 2016 | 3/29/2016


హైదరాబాద్: రూ.20 కోట్లు కాదు కదా రూ.100 కోట్లు ఇచ్చినా తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేది లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ స్పష్టం చేశారు. తాము శాశ్వతంగా వైఎస్ఆర్ సీపీలోనే కొనసాగుతామని చెప్పారు. ఎప్పటికైనా టీడీపీ ఓ మునిగే పడవ అని ఆమె అన్నారు. ఆ పార్టీలోకి పోయి ఏం చేయాలని, అలా చేస్తే జనాలు ఛీ కొడతారని అన్నారు.

ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టేందుకే టీడీపీ కుట్రలు చేస్తుందని ఆమె మండిపడ్డారు. అందుకే రంపచోడవరం వంతల రాజేశ్వరీకి రూ.20 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారని అన్నారు. గిరిజన బిడ్డలమైన తాము వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే అసెంబ్లీలో అడుగుపెట్టగలిగామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గిరిజన ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నందున వారిని లాక్కునేందుకే టీడీపీ కుట్రలు చేస్తుందని ఆ కుట్రలు మానుకోవాలని హెచ్చరించారు.
 
Share this article :

0 comments: