పార్టీ మారితే రూ.20 కోట్లు ఇస్తామన్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ మారితే రూ.20 కోట్లు ఇస్తామన్నారు

పార్టీ మారితే రూ.20 కోట్లు ఇస్తామన్నారు

Written By news on Tuesday, March 29, 2016 | 3/29/2016


'పార్టీ మారితే రూ.20 కోట్లు ఇస్తామన్నారు'
హైదరాబాద్: పార్టీ మారితే రూ.20 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని వైఎస్సార్ సీపీకి చెందిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వెల్లడించారు. తాను డబ్బుకు లొంగే మనిషిని కాదని స్పష్టం చేశారు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పారు.

మంగళవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె 'సాక్షి'తో మాట్లాడారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే తాను ఎమ్మెల్యే అయ్యాయని, చివరివరకు వైఎస్సార్ సీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోని వచ్చానని చెప్పారు. విశ్వసనీయతతో పనిచేస్తానని, రాజకీయాల్లో కొనసాగినంతకాలం జగనన్న వెంటే ఉంటానని స్పష్టం చేశారు. తన గురించి అనవసరంగా కొన్ని ప్రతికలు, వార్తా చానళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తనను అడగకుండా ఎలా రాస్తారని ఆమె ప్రశ్నించారు.
Share this article :

0 comments: