ఏకంగా రూ.30 కోట్లు ఇస్తామని .. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏకంగా రూ.30 కోట్లు ఇస్తామని ..

ఏకంగా రూ.30 కోట్లు ఇస్తామని ..

Written By news on Sunday, March 13, 2016 | 3/13/2016


రూ.30 కోట్లు ఎర
టీడీపీ నేతలు నన్ను కొనాలనుకున్నారు
బయటపెట్టిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర


 
సాక్షి, సాలూరు: ‘‘తెలుగుదేశం పార్టీ నాయకులు నన్ను ప్రలోభపెట్టి ఆ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించారు. తొలుత నాకు రూ.5 కోట్లు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత రూ.15 కోట్లతోపాటు మంత్రి పదవి కూడా ఇస్తామన్నారు. నేను స్పందించకపోవడంతో ఏకంగా రూ.30 కోట్లు ఇస్తామని చెప్పారు’’ అని విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర(వైఎస్సార్‌సీపీ) వెల్లడించారు.

ఆయన శనివారం వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా సాలూరు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. టీడీపీ నాయకత్వం తనను కొనుగోలు చేసే విషయంలో తెరవెనుక జరిగిన మంతనాలను బయట పెట్టారు. ఇటీవల ప్రలోభాలకు లోనై వైఎస్సార్‌పీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు అధికార పక్షం వారితో ఇమడలేక, వారి మధ్య కూర్చోలేక, ప్రజలకు సమాధానం చెప్పుకోలేక అవస్థలు పడుతున్నారని తెలిపారు.
ప్రజా విశ్వాసం కోల్పోయిన టీడీపీ
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని టీడీపీ ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే తాము సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని రాజన్నదొర తెలిపారు. చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకున్న చందంగా టీడీపీ నాయకులు ఎన్టీఆర్ పేరు చెప్పుకొని కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను 100 శాతం అమలు చేశామని చెప్పగలరా? అని సవాల్ విసిరారు.

మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేయడం లేదని, అర్హులైనవారికి పింఛన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి నేడు ఉన్న ఉద్యోగాలను తొలస్తున్నారని విమర్శించారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అందజేస్తామని చెప్పి బడ్జెట్‌లో పైసా కూడా కేటాయించలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకే శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టామన్నారు.
Share this article :

0 comments: