ప్రారంభించిందీ వైఎస్సే లిఫ్ట్ పెట్టడమే చంద్రబాబు చేసింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రారంభించిందీ వైఎస్సే లిఫ్ట్ పెట్టడమే చంద్రబాబు చేసింది

ప్రారంభించిందీ వైఎస్సే లిఫ్ట్ పెట్టడమే చంద్రబాబు చేసింది

Written By news on Wednesday, March 30, 2016 | 3/30/2016


నారావారి నదుల అనుసంధానం కత!కృష్ణా-గోదావరి సంగమంపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ(ఫైల్)
పట్టిసీమ ప్రచారంపై అన్ని వర్గాల్లో ఆశ్చర్యం
గోదావరి-కృష్ణా అనుసంధానించానని చెప్పుకుంటున్న సీఎం
వైఎస్ హయాంలోనే కుడికాల్వ నిర్మాణం
పోలవరం పనులను ప్రారంభించిందీ వైఎస్సే లిఫ్ట్ పెట్టడమే చంద్రబాబు చేసింది

 
సాక్షి, హైదరాబాద్: గోదావరి-కృష్ణా అనుసంధానం ఘనత తనదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటున్న తీరు పట్ల అన్ని వర్గాల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. నదుల అనుసంధానం సాధించేశామని సీఎం చెబుతున్న మాటలకు నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదని సాగునీటి రంగం నిపుణులు, జల వనరుల శాఖ ఇంజనీర్లు అంటున్నారు. నవ్విపోదురు గాక.. అన్నట్లు ముఖ్యమంత్రి వ్యవహారం ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి... పోలవరం ప్రాజెక్టు పనులను సాహసోపేతంగా ప్రారంభించి, అన్ని అనుమతులు సంపాదించడంతో పాటు కుడి, ఎడమ కాల్వలను దాదాపు పూర్తి చేసిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. 70 శాతం పూర్తయిన కుడికాల్వను ఉపయోగించుకొని, మిగిలిపోయిన 30 శాతం కాల్వను పూర్తిస్థాయిలో నిర్మించకుండా, తూతూమంత్రంగా పిల్లకాలువ తీసి, పట్టిసీమ నుంచి 4 టీఎంసీల నీటిని తెచ్చిన విషయం విదితమే. పట్టిసీమ మోటార్లు ఏర్పాటు చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన పని. దానికే.. నదుల అనుసంధానం చేశానని కోతలు కోయడం పట్ల అన్ని వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

వైఎస్ ఘనత ఇదీ..
‘పోలవరం హెడ్‌వర్క్స్‌తో పాటు కుడి, ఎడమ కాల్వ పనులను కూడా ఒకే సారి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. కుడి, ఎడమ కాల్వల పనులు ఆయన ఉన్నప్పుడే 70 శాతానికిపైగా పూర్తయ్యాయి. హెడ్‌వర్క్స్ పనులు చేయడంలో అప్పటి కాంట్రాక్టర్లు జాప్యం చేయడంతో రద్దు చేశారు. ఒకే ప్యాకేజీ కింద టెండర్లు పిలిచి వేగంగా పూర్తి చేయించాలని భావించారు. అంతలోనే ఆంధ్రప్రదేశ్‌ను దురదృష్టం వెంటాడింది. హెలికాప్టర్ దుర్ఘటనలో వైఎస్ చనిపోవడంతో పోలవరాన్ని పట్టించుకున్న నాథుడే లేడు’ అని సాగునీటి రంగం నిపుణులు గుర్తు చేస్తున్నారు.

కుడి కాల్వ మీద రాద్ధాంతం చేసిన టీడీపీ
‘హెడ్‌వర్క్స్ పనులు పూర్తి చేయకుండా కాల్వ పనులను వైఎస్ ప్రభుత్వం చేపట్టడాన్ని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం రాద్ధాంతం చేసింది. తీవ్రస్థాయిలో విమర్శలకు దిగింది. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులను కూడగట్టి కుడికాల్వ పనులకు అడ్డుపడింది. 175 కిలోమీటర్ల కుడికాల్వ పనుల్లో దాదాపు 150 కిలోమీటర్ల కాల్వను వైఎస్ తన హయాంలోనే పూర్తి చేశారు. కాల్వ పనులు పూర్తి చేయడం అంటే.. తాత్కాలికంగా కొద్దిపాటి నీటి ప్రవాహానికి వీలుగా అరకొర పనులు చేయడం కాదు. 80 మీటర్ల వెడల్పుతో కాల్వ తవ్వి లైనింగ్ పనులు పూర్తి చేయించారు. 150 కిలోమీటర్ల మేర కాల్వకు లైనింగ్ కూడా వేయించారు’ అని పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తున్న ఇంజనీర్లు చెప్పారు.

తూతూమంత్రంగా పనులు చేయించిన టీడీపీ..
కుడికాల్వ పనులపై అప్పట్లో రాద్ధాంతం చేసిన టీడీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పనులనే ఆసరాగా చేసుకొని, తామే ఆ పనులన్నీ చేశామనే బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. కుడికాల్వను ఉపయోగించుకొని పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 4 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తోంది. కాల్వలో మిగిలిన 30 శాతం పనులనైనా పూర్తిగా చేయకుండా తూతూమంత్రం పనులతో ప్రభుత్వం సరిపెట్టింది.

రామిలేరు, తమ్మిలేరు మీద రెండు ప్రధాన అక్విడెక్టులు, 50కిపైగా చిన్న వంతెనలు, 15 కిలోమీటర్లకుపైగా కాల్వ తవ్వకం.. అన్నీ అరకొరగానే చేశారు. 80 మీటర్ల వెడల్పుతో కాల్వ తవ్వాల్సి ఉండగా, వేగంగా పూర్తి చేయడానికి 20 మీటర్ల వెడల్పే తవ్వారు. అక్కడ కూడా లైనింగ్ చేయకుండా విడిచిపెట్టారు. ప్రజలు, పశువుల రాకపోకలకు వీలుగా వంతెనలు నిర్మించాల్సిన చోట.. పైపులు పెట్టి సిమెంట్ కాంక్రీట్ వేశారు. అక్విడెక్టులు పూర్తిగా చేయకుండా, నాలుగో వంతు.. ఒక్కో ‘వెంట్’తో మమ అనిపించారు. అది కూడా తూతూమంత్రంగా చేయడంతో.. కొద్దిపాటి నీటి ప్రవాహానికే తెగిపోయిన విషయం విదితమే. ఇవన్నీ తాత్కాలిక పనులేనని, సమయం లేకపోవడంతో ఇలా చేయాల్సి వస్తోందని ముఖ్యమంత్రే స్వయంగా అప్పట్లో చెప్పారు.

హడావుడి పూర్తయిన తర్వాత మళ్లీ కుడికాల్వ పనులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు పనులేమీ చేయకుండా.. ఇప్పుడు మళ్లీ హడావుడిగా మొదలుపెట్టడం గమనార్హం. హడావుడి ఉంటే తప్ప భారీగా సొమ్ము నొక్కేయడానికి వీలు కాదని, అందుకే ప్రభుత్వం ఆఖరు నిమిషం వరకు తాత్సారం చేసి, హడావుడిగా పనులు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోందని సాగునీటి శాఖ ఇంజనీర్లే చెబుతున్నారు.
 
స్వాతంత్య్రానికి పూర్వమే నదుల అనుసంధానం
తెలుగునాట 140 సంవత్సరాల క్రితమే నదుల అనుసంధానం జరిగింది. తుంగభద్ర-పెన్నా అనుసంధానం.. 306 కిలోమీటర్ల  కేసీ కెనాల్(కర్నూలు-కడప కాలువ) ద్వారా జరిగింది. 1863-70 మధ్య కాలంలో డచ్ కంపెనీ.. నావిగేషన్, సాగునీటి అవసరాల కోసం ఈ కాల్వను తవ్వింది. 1882లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ కాల్వను డచ్ కంపెనీ నుంచి రూ. 3.02 కోట్లకు కొనుగోలు చేసింది. కాటన్ సూచనల మేరకు.. కేసీ కెనాల్‌లో నావిగేషన్ రద్దు చేసి, పూర్తిగా సాగునీటి అవసరాలకే వాడటం బ్రిటీష్ ప్రభుత్వం ప్రారంభించింది.
 
  • 1953లో తుంగభద్ర హైలెవల్ కెనాల్ ద్వారా తుంగభద్ర-పెన్నా-చిత్రావతి అనుసంధానం పూర్తయింది.
  • తెలుగుగంగ, గాలేరు-నగరి సుజల స్రవంతి ద్వారా కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం జరిగింది.
Share this article :

0 comments: