సన్నిహితుల సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన ఆనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సన్నిహితుల సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన ఆనం

సన్నిహితుల సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన ఆనం

Written By news on Wednesday, March 23, 2016 | 3/23/2016


సన్నిహితుల సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన ఆనం
నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు ఆనం విజయకుమార్‌రెడ్డి, ఆయన కుమారుడు కార్తికేయరెడ్డి, వారి అనుచరులు బుధవారం వైఎస్ జగన్ మెహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. కస్తూరిదేవి గార్డెన్స్‌ లో జరిగిన సభలో ఆనం విజయకుమార్ రెడ్డి, ఆయన తనయుడు కార్తికేయరెడ్డికి పార్టీ కండువాలు వేసి వైఎస్ జగన్ వారిని సాదరంగా ఆహ్వానించారు. విజయకుమార్‌రెడ్డి ఇటీవల జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే తన అనుచరులు, సన్నిహితులు కస్తూరిదేవి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

ఈ సందర్భంగా కార్తికేయరెడ్డి మాట్లాడుతూ... వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్ సీపీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాని గోవర్థన్, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

అంతకుముందు రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు చేరుకున్న వైఎస్ జగన్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుంచి నాయుడుపేట మొదలు ప్రతిచోటా ఆయనకు నాయకులు ఘన స్వాగతం పలికారు. దీంతో ఆయన నెల్లూరుకు చేరుకోవడం ఆలస్యమైంది. కస్తూరిదేవి గార్డెన్స్ లో కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో సభా ప్రాంగణం నుంచి లోపలకు రావడానికి వైఎస్ జగన్ కు చాలా సమయం పట్టింది.
Share this article :

0 comments: