విషమైనా తీసుకుంటా.. టీడీపీలో చేరను - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విషమైనా తీసుకుంటా.. టీడీపీలో చేరను

విషమైనా తీసుకుంటా.. టీడీపీలో చేరను

Written By news on Friday, March 25, 2016 | 3/25/2016


విషమైనా తీసుకుంటా..  టీడీపీలో చేరను
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని

 మచిలీపట్నం టౌన్ : ‘విషమైనా తీసుకుంటా కానీ టీడీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు’ అని  వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. ప్రాణం ఉన్నంత వరకూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అండగా ఉంటూ, వైఎస్సార్ సీపీలోనే కొనసాగుతానని స్పష్టంచేశారు. తాను టీడీపీలో చేరుతున్నారంటూ కొంతకాలంగా షికారుచేస్తున్న పుకార్లను ఖండిం చారు. స్థానిక రామానాయుడుపేటలోని పార్టీ కార్యాల యంలో గురువారం పేర్ని నాని విలేకరులతో మాట్లాడుతూ తాను టీడీపీలో చేరుతున్నానని ఓ పత్రిక (సాక్షి కాదు)లో వచ్చిన వార్తకు ఎలాంటి విశ్వసనీయత లేదని స్పష్టంచేశారు.

కాంగ్రెస్ పార్టీని బతికించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీ అధిష్టానం వేధింపులకు గురిచేయడం, కక్ష సాధింపులకు దిగడంతో తాను మనస్తాపానికి గురై వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకుని, ఏడాదిన్నరకు ముందే ఎమ్మెల్యే, విప్ పదవులను త్యజించి వైఎస్సార్ సీపీలో చేరానని గుర్తుచేశారు. తాను పదవుల కోసమే ఆలోచించే వ్యక్తినే అయితే ఏడాదిన్నరకు ముందే క్యాబినెట్ హోదా గల విప్ పదవిని వదలి పార్టీ మారేవాడినే కాదన్నారు.

తనకు వైఎస్సార్‌పై ఉన్న అపారమైన, అచంచలమైన ప్రేమాబిమానాలు ఉన్నాయని, తన ఊపిరి ఉన్నంత వరకూ వైఎస్ కుటుంబానికి అండగానే ఉంటానే తప్ప పార్టీలు మారే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. తనకు ఊహ వచ్చినప్పటి నుంచీ టీడీపీపై వ్యతిరేకతతోనే పెరిగానని, అలాంటి తాను నేడు ఆ పార్టీలో ఏమి ఆశించి చేరాలని ప్రశ్నించారు. నియోజకవర్గంలో తన హయాంలో చేసిన అభివృద్ధి మైలు రాళ్లు అనేకం ఉన్నాయని అవే తనకు సంతృప్తిని ఇస్తాయని పేర్కొన్నారు.

శ్వాస ఉండి రాజకీయాల్లో ఉన్నతంకాలం తాను వైఎస్ కుటుంబంతోనే ఉంటానని ఉద్ఘాటించారు. మునిసిపల్ ప్రతిపక్ష ఉప నాయకుడు శీలం మారుతిరావు(బాబ్జీ), కౌన్సిలర్లు లంకా సూరిబాబు, మేకల సుబ్బన్న, తాళ్లపాలెం సర్పంచి వాలిశెట్టి రవిశంకర్, మాజీ కౌన్సిలర్ చిటికిన నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Share this article :

0 comments: