‘కృష్ణపట్నం’ పనుల్లో అక్రమాలు ఇవిగో.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘కృష్ణపట్నం’ పనుల్లో అక్రమాలు ఇవిగో..

‘కృష్ణపట్నం’ పనుల్లో అక్రమాలు ఇవిగో..

Written By news on Wednesday, March 23, 2016 | 3/23/2016


అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘‘నెల్లూరు జిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం) పనుల్లో అనేక అక్రమాలు జరిగాయి. టెండర్లు పిలవకుండా పనులను బిట్లుబిట్లుగా విభజించి అడ్డగోలుగా నామినేషన్ పద్ధతిలో అధికార పార్టీ వారికి కట్టబెట్టారు. దీనివల్ల భారీగా నిధులు దుర్వినియోగమయ్యాయి. దీనిపై హౌస్‌కమిటీ వేస్తే అక్రమాలను నిరూపిస్తా’’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ పనులను నామినేషన్ పద్ధతిపై ఇవ్వవచ్చా? అని గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు.
టెండర్ల ద్వారానే పనులు ఇచ్చామని, ఒక్క పని కూడా నామినేషన్‌పై ఇవ్వలేదని మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమివ్వడాన్ని గోవర్ధన్‌రెడ్డి తప్పుబట్టారు. ‘‘ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే మీ అధికారులే సమాచారం ఇచ్చారు.  నామినేషన్ పద్ధతిపైనే పనులు ఇచ్చినట్లు ఇవిగో పక్కా ఆధారాలు (పత్రాలు చూపిస్తూ). మీరు నామినేషన్‌పై పనులు ఇవ్వలేదంటున్నారు.  మీ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారా? ఈ సభ ద్వారా ప్రజలను మంత్రి తప్పుదోవ పట్టించవద్దు. హౌస్ కమిటీ వేయండి లేదా విచారణ జరిపించండి. అక్రమాలు నిరూపిస్తాం. సభకు ఆధారాలతో రావాలని గతంలో సీఎం అన్నారు. అందుకే ఆధారాలు సమర్పిస్తున్నాం.విచారించి చర్యలు తీసుకోండి’’ అని గోవర్ధన్‌రెడ్డి కోరారు. ఆధారాలిస్తే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మొత్తం ఆధారాలు స్పీకరుకు సమర్పిస్తున్నానని గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.
Share this article :

0 comments: