
కేంద్రమంత్రి సుజనాచౌదరిపై కూడా కథనాలు వచ్చాయని, ఆ కథనాలు ప్రసారం చేసిన మీడియాపై కూడా చర్యలు తీసుకుంటారా అని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు, రేవంత్ రెడ్డిలపై కథనాలు ప్రసారం చేసిన మీడియాపై కూడా చర్యలు తీసుకుంటారని అని ఆయన అడిగారు. భూ దందాపై అన్ని ఆధారాలతో 'సాక్షి' బయటపెట్టిన మీరు ఇంకా ఆధారాలు కావాలంటున్నారు. ఏ ఆధారాలు కావాలని కోటంరెడ్డి అన్నారు. ఇవాళ చంద్రబాబు విచారణ నుంచి తప్పించుకోవచ్చని... అయితే ఏదో ఒకరోజు చంద్రబాబుకు శిక్ష తప్పదని కోటంరెడ్డి హెచ్చరించారు.
చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది స్కీంల పాలన కాదని, స్కామ్ ల పాలన అని కోటంరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఏనాటికైనా విచారణ ఎదుర్కోవాల్సిందేనని, జోన్ త్రీలో ఉన్నది మీరు, మీ మంత్రులేనని కోటంరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ సర్వనాశనం చేసిందని, ఇప్పుడు టీడీపీ సర్కార్ రాజధాని పేరుతో రైతుల కడుపు కొట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
0 comments:
Post a Comment