ఖమ్మం ప్రధాన రహదారులు వైఎస్సార్‌సీపీ జెండాలతో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఖమ్మం ప్రధాన రహదారులు వైఎస్సార్‌సీపీ జెండాలతో

ఖమ్మం ప్రధాన రహదారులు వైఎస్సార్‌సీపీ జెండాలతో

Written By news on Saturday, March 5, 2016 | 3/05/2016


వైఎస్సార్‌సీపీ భారీ బైక్ ర్యాలీ
ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరోజైన  శుక్రవారం  నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో భారీ బైక్ ర్యాలీ  నిర్వహించారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని డివిజన్‌ల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులను ప్రచార రథం ద్వారా ప్రజలకు పరిచయం చేశారు. ఫ్యాను గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. బల్లేపల్లిలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన బైక్ ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్, శ్రీశ్రీ సర్కిల్, ఇల్లెందు క్రాస్‌రోడ్డు, గట్టయ్య సెంటర్, రాపర్తినగర్, మయూరి సెంటర్, ముస్తఫానగర్, గాంధీచౌక్, మార్కెట్ గుండా ఎఫ్‌సీఐ గోడౌన్ వరకు కొనసాగింది.

భారీ సంఖ్యలో బైక్ లతోర్యాలీ నిర్వహించడంతో ఖమ్మం ప్రధాన రహదారులు వైఎస్సార్‌సీపీ జెండాలతో నిండిపోయాయి. ర్యాలీలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు  రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, నేతలు ఎం.నిరంజన్‌రెడ్డి, సాధు రమేష్‌రెడ్డి,  బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, భీమా శ్రీధర్, దారా యుగంధర్, నాగేంద్ర పాల్గొన్నారు.
Share this article :

0 comments: