స్పీకర్ కుర్చీని కూడా వాడుకుంటున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్పీకర్ కుర్చీని కూడా వాడుకుంటున్నారు

స్పీకర్ కుర్చీని కూడా వాడుకుంటున్నారు

Written By Unknown on Tuesday, March 15, 2016 | 3/15/2016


స్పీకర్ కుర్చీని కూడా వాడుకుంటున్నారు
హైదరాబాద్: పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకుండా, వారిని కాపాడుకునేందుకోసం టీడీపీ ప్రభుత్వం స్పీకర్ కుర్చీని కూడా వాడుకుంటోందని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు అందిన 14 రోజుల తర్వాతే చర్చ జరగాలని అన్నారు. రూల్ 71 ప్రకారం సభ్యులకు విప్ జారీ చేసేందుకు 14 రోజులు గడువు ఇవ్వాలని ఉందని చెప్పారు. మంగళవారం రెండున్నర గంటలు వాయిదాపడిన ఏపీ అసెంబ్లీ మళ్లీ ప్రారంభమైంది.

స్పీకర్ పై వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు అంశాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ప్రస్తావించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి, నిస్సిగ్గుగా టీడీపీలోకి చేర్చుకున్నారని ఆరోపించారు. టీడీపీలోకి చేరిన 8 మంది ఎమ్మెల్యేలను  కాపాడుకునేందుకు స్పీకర్ కుర్చీని కూడా వాడుకుంటున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. పార్టీ మారిన ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అవకాశం లేకుండా వెంటనే అవిశ్వాస తీర్మానంపై చర్చను చేపట్టారని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే  ఉప ఎన్నికలు వస్తాయని, ప్రజల దగ్గరకు వెళితే మళ్లీ గెలుస్తామనే నమ్మకం టీడీపీకి లేదని, అందుకే ఆ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు
Share this article :

0 comments: