ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వలేదు: గోపిరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వలేదు: గోపిరెడ్డి

ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వలేదు: గోపిరెడ్డి

Written By Unknown on Tuesday, March 15, 2016 | 3/15/2016


ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వలేదు: గోపిరెడ్డి
హైదరాబాద్ : ఎమ్మెల్యేల హక్కులను కాపాడాల్సిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు వాటిని కాలరాస్తున్నారని నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో కూడా కోడెల శివప్రసారావు సమీక్షలు చేస్తున్నారని అన్నారు.
 
ఆయన సత్తెనపల్లి ఎమ్మెల్యే అయినప్పటికీ.. తన నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో జరగాల్సిందేనన్నారు.  ప్రభుత్వ కార్యక్రమాలకు చాలాసార్లు స్థానిక ఎమ్మెల్యేగా తనకు సమాచారం కూడా ఇవ్వరన్నారు. అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నారు.  ఇది వాస్తవమని, దీనిపై సభా కమిటీ వేస్తే వాస్తవం తెలుస్తుందన్నారు. శాసనసభ స్పీకర్ గా ఆయన తన హక్కులను కాపాడటం లేదని ఎమ్మెల్యే గోపిరెడ్డి అన్నారు. అందుకే తాము అవిశ్వాస తీర్మానం ఇచ్చామన్నారు.

ఇక బాంబు పేలుళ్ల కేసులో కోడెల శివప్రసారావుకు సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదని గోపిరెడ్డి స్పష్టం చేశారు.  కోడెలను సీబీఐ ప్రాసిక్యూషన్ కు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒప్పులేదన్న విషయం తెలుసుకోవాలన్నారు. రికార్డులు పరిశీలిస్తే తెలుస్తుందన్నారు. ఇక ఎమ్మెల్యేను గాయపరిచి, ఎంపీటీసీలను కిడ్నాప్ చేసిందెవరో అందరికీ తెలుసు అని అన్నారు. అలాగే స్పీకర్ స్ధానంలో ఉన్న వ్యక్తి పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరు కావచ్చా అని ఎమ్మెల్యే గోపిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా ఆయన అవినీతి గురించి సభలో మాట్లాడాలని డిమాండ్ చేశారు
Share this article :

0 comments: