బాబు వివరణ తమాషాగా ఉందా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు వివరణ తమాషాగా ఉందా!

బాబు వివరణ తమాషాగా ఉందా!

Written By news on Monday, March 7, 2016 | 3/07/2016

రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి వద్ద తను ఉంటున్న ఇంటికి సంబందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చారు.లింగమనేని ఎస్టేస్ గెస్ట్ హౌస్ ల్యాండ్ పూలింగ్ ద్వారా వచ్చిందని, అంటే అది ప్రభుత్వ ఆస్తి అని , అందువల్ల తాను అందులో ఉంటున్నానని చంద్రబాబు చెప్పారని సమాచారం వచ్చింది. లింగమనేని గెస్ట్ హౌస్ ను పూలింగ్ ద్వారా తీసుకుంటే ఆ విషయాన్ని ఎందుకు ప్రకటించలేదో తెలియదు. ప్రభుత్వం పూలింగ్ కింద తీసుకుంటే ఆ ఇల్లు సక్రమం అయిపోతుందా? నదీ పరివాహక పరిరక్షణ చట్టం కిందకు రాదా?లింగమనేని భవంతి తో పాటు అక్కడ ఉన్న మరో సుమారు ఇరవై భవంతులను కూడా ఇలాగే పూలింగ్ కింద తీసుకున్నారా?పూలింగ్ కింద తీసుకున్న భవనాలను ప్రభుత్వం ఇలా వాడుకోవచ్చా?అన్న ప్రశ్నలకు సమాధానం తెలియవలసి ఉంది.లింగమనేని భూములు పూలింగ్ కింద ఇస్తానంటే వద్దన్నానని, సరిపడ భూమి ఉండడమే కారణమని చంద్రబాబు చెప్పడం విశేషం. ఒక పక్క వేల ఎకరాలు ప్రభుత్వం తీసుకుంటూ ,మరో పక్క ప్రభుత్వానికి భూమి ఇస్తానంటే ముఖ్యమంత్రే వద్దని చెప్పడం ఆశ్చర్యంగానే ఉంటుంది.
http://kommineni.info/articles/dailyarticles/content_20160306_25.php
Share this article :

0 comments: