చంద్రబాబుకు జగన్ సవాల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుకు జగన్ సవాల్

చంద్రబాబుకు జగన్ సవాల్

Written By Unknown on Wednesday, March 16, 2016 | 3/16/2016


చంద్రబాబుకు జగన్ సవాల్
హైదరాబాద్ :
ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విసిరిన సవాలుతో అధికార పక్షం తోక ముడిచింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇరుకున పడింది. వ్యవసాయ రుణాలన్నింటినీ పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల ముందు అన్నారని, ఆయన అలా అనలేదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, కాదంటే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని ఆయన సవాలు విసిరారు.

అయితే జగన్ సవాలుకు అధికార పక్షం ఏమాత్రం స్పందించలేదు. దాంతో చంద్రబాబు అన్న మాటలను అసెంబ్లీలో ప్లే చేస్తానని జగన్ అన్నారు. నాడు చంద్రబాబు అన్న మాటలను తాను ప్రతి సభలోనూ చెప్పానని ఆయన తెలిపారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం బయటకు రావాలంటే బాబు సీఎం కావాలని అనలేదా అంటూ ప్రశ్నించారు. ఈ సవాలుతో అధికారపక్షం ఇరుకున పడింది.
Share this article :

0 comments: