మోసగించడమే బాబు నైజం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మోసగించడమే బాబు నైజం

మోసగించడమే బాబు నైజం

Written By news on Wednesday, March 2, 2016 | 3/02/2016


మోసగించడమే బాబు నైజం
ఊపిరి ఉన్నంతవరకు జగనన్న వెన్నంటే ఉంటా
వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తల సమావేశంలో గుమ్మనూరు జయరాం

చిప్పగిరి:  అధికారం కోసం రైతులకు, డ్వాక్రామహిళలకు, వివిధ వర్గాల ప్రజలకు ఎన్నికల ముందు కలబొల్లి మాటలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేశారని, రాజకీయాల్లో అది ఆయన నైజమని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విమర్శించారు. మంగళవారం మండల పరిధిలోని నేమకల్ గ్రామంలో  వైఎస్సార్సీపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

పార్టీ మండల కన్వీనర్ బెల్డోణ ఓబులేష్  అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ  బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు పోతుంటే నోరుమెదపడం లేదన్నారు. పార్టీని బతికించుకునేందుకు ప్రస్తుతం చంద్రబాబునాయుడు దిగుడుజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఎరచూపి చేర్పించుకుంటున్నారని ఆరోపించారు. బాబు ప్రలోభాలకు తాను లొంగనని ఊపిరి ఉన్నంతవరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటే ఉంటానని ఎమ్మెల్యే చెప్పారు.

ఈ విషయంలో కార్యకర్తలు, నాయకులు ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దన్నారు. అంతకుముందు డేగులపాడు గ్రామం నుంచి నేమకల్ వరకు వైఎస్సార్సీపీ యువనాయకులు గుమ్మనూరు నారాయణ, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు విక్రాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు.  

సమావేశంలో ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు శ్రీను, సర్పంచులు సురేష్‌రెడ్డి, నాగేంద్ర, కొండాదేవికాశేఖర్, రోహిణి, మల్లమ్మ,  వైసీపీ మండల కన్వీనర్లు చిన్నఈరన్న, భీమప్పచౌదరి, లుముం బా, దొరబాబు, ఓబులేష్, మండల నాయకులు డేగులపాడు మాజీ సర్పంచు మల్లికార్జున, వీరాంజనేయులు, ఇందుశేఖర్‌రెడ్డి, భీమిరెడ్డి, మారయ్య, ధనుంజయ, గుమ్మనూరు నారాయణ, సుధ, నారి, కో-కన్వీనర్ లోకనాథ్, దౌల్తాపురం చిన్నబాబు, సాబాల గోవిందు పాల్గొన్నారు.
Share this article :

0 comments: