ఇదేమి దోపిడీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇదేమి దోపిడీ

ఇదేమి దోపిడీ

Written By news on Tuesday, March 8, 2016 | 3/08/2016


ఇదేమి దోపిడీ
♦ అవినీతిలో ‘ఎవరెస్ట్’ను ఎక్కిన బాబు
♦ 22 మాసాల్లో లక్షా 35 వేల కోట్ల ప్రజాధనం లూటీ
♦ ప్రభుత్వం జారీ చేసిన జీవోలే సాక్ష్యం

 ‘నేను నిప్పులాంటి వాడిని.. నిజాయితీపరుడిని..’
 అని చంద్రబాబు తరచూ ప్రకటించుకుంటున్నారు.
 కానీ ఈ ‘నీతివంతమైన’ ప్రకటనలకు, ఆయన సాగిస్తున్న అవినీతిమయ పాలనకు పొంతన కుదరడం లేదు. ఇరవై రెండు నెలల పాలనలో ఎన్నో కుంభకోణాలు... తన ‘ఘనమైన’ అవినీతి రికార్డులన్నిటినీ చంద్రబాబు తానే బద్దలుకొట్టేశారు. అక్రమార్జనలో ఆయన ఎవరెస్టు శిఖరాన్ని అందుకున్నారు. గతంలో తొమ్మిదేళ్లలో సాగించిన దోపిడీని ఈసారి 22 నెలల్లోనే దాటేశారు.

 ఇసుక నుంచి బొగ్గు వరకూ... ఇరిగేషన్ నుంచి అమరావతి వరకు ‘కాదేదీ అవినీతికి అనర్హం’ అని నిరూపించారు. అలవికాని హామీలను అలవోకగా గుప్పించి అత్తెసరు ఆధిక్యతతో అధికారపీఠాన్ని కైవసం చేసుకున్న చంద్రబాబు వాటిలో ఒక్కదాన్నీ అమలు చేసిన పాపాన పోలేదు. పైగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే అవినీతి రథాన్ని జెట్‌వేగంతో పరుగులెత్తించడం ప్రారంభించారు. అన్ని రంగాలలోనూ అవినీతిని సంస్థాగతం చేసేశారు. ఆయన నాయకత్వంలో రాష్ర్టచరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో కుంభకోణాలు జరుగుతున్నాయి.

 ముడుపులు, కమీషన్లు, లంచాలు, ఆమ్యామ్యాలు, వాటాలు... పేరేదైనా అన్నీ బహిరంగమే. అంతా ఓపెన్... నీకెంత..? నాకెంత.. అని కింది స్థాయి నాయకుల నుంచి సీఎం వరకు కమీషన్ల పంపకాలు జరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి తనయుడు లోకేశ్ స్వయంగా దగ్గరుండి మరీ కమీషన్ల పంపకాలను పర్యవేక్షిస్తున్నారని, ఏ స్థాయి అధికారి వాటా ఎంతో స్పష్టంగా నిర్ణయించేశారని సచివాలయ వర్గాలంటున్నాయి. రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిన ‘చినబాబు’ పేరు అన్ని కుంభకోణాల్లోనూ ప్రబలంగా వినిపించడం ఇందుకు సాక్ష్యం. ఈనేపథ్యంలో ఈ ఇరవై రెండు నెలల్లో రాష్ర్టంలో చోటుచేసుకున్న అవినీతి కుంభకోణాల గురించి రేఖామాత్రంగా పరిశీలిద్దాం..
Share this article :

0 comments: