ప్రభుత్వ నిరంకుశ పోకడపై వైఎస్ఆర్ సీపీ నిరసన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వ నిరంకుశ పోకడపై వైఎస్ఆర్ సీపీ నిరసన

ప్రభుత్వ నిరంకుశ పోకడపై వైఎస్ఆర్ సీపీ నిరసన

Written By news on Monday, March 21, 2016 | 3/21/2016


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో సోమవారం ప్రివిలేజ్ కమిటీ నివేదికపై చర్చించనున్నారు. అయితే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో హై కోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో ఈ సమావేశాలకు దూరంగా ఉండి నిరసన తెలుపాలని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో సమావేశాలను ప్రభుత్వం ఏకపక్షంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

శాసన సభలో ప్రతిపక్షం ఇచ్చిన 'అసమ్మతి నోట్' లను పట్టించుకోకుండా ముందుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులపై కుట్రపూరిత ధోరణిలో నివేదికలు రూపొందించడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కోర్టు ధిక్కారంపై నేడు హైకోర్టులో జరగనున్న విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Share this article :

0 comments: