ఇక్కడ సక్రమం.. అక్కడ విరుద్ధమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇక్కడ సక్రమం.. అక్కడ విరుద్ధమా?

ఇక్కడ సక్రమం.. అక్కడ విరుద్ధమా?

Written By news on Monday, March 14, 2016 | 3/14/2016


ఇక్కడ సక్రమం.. అక్కడ విరుద్ధమా?
► చంద్రబాబూ.. ఎన్నాళ్లు ఈ నీచ రాజకీయాలు
► వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి,
► ఎమ్మెల్యే పీఆర్కే


మాచర్ల : ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ సీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలను రాజ్యాంగ విరుద్ధంగా కొనుగోలు చేస్తుంటే పట్టించుకోకుండా.. తెలంగాణలో టీడీపీ నాయకుడు రేవంత్‌రెడ్డి అక్కడి ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అమ్ముడుపోవటం ప్రజాస్వామ్యం ఖూని అయినట్లు మాట్లాడటం వింతగా ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ స్థానిక కార్యాలయం వద్ద ఆదివారం వారు విలేకర్లతో మాట్లాడారు. నైతిక విలువలను మరిచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన టీడీపీ నాయకులు రెండు నాలుకల ధోరణిలో మాట్లాడటం దారుణమన్నారు.

తమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన వైఎస్సార్ సీపీ కేడర్ ఎక్కడికీ పోదని చెప్పారు. రానున్న రోజులన్నీ వైఎస్సార్ సీపీవేనని స్పష్టం చేశారు. ప్రజల అభిమానం తమ పార్టీవైపే ఉందన్నారు. ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేక, హామీలను అమలు చేయలేక ప్రజలు ఛీకొడుతుంటే.. దాన్నుంచి దృష్టిని మరల్చడానికి టీడీపీ ఈ దుర్నీతికి పాల్పడిందని విమర్శించారు. ఆ పార్టీలోకి వెళ్లినవారు తమ సీటు ఎక్కడో తెలియక, వాళ్ల పరిస్థితి ఏంటో అర్థం కాక అప్పుడే అసంతృప్తిలో ఉన్నారన్నారు.

జిల్లాలో అధికారంలోకి వ చ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు చెందిన కౌన్సిలర్‌ల నుంచి ఎమ్మెల్యేల వరకు మంతనాలు జరుపుతూ మంత్రులు, అధికార పార్టీ నాయకులు కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో పార్టీ యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ యరబోతుల శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ కామనబోయిన కోటయ్య, పట్టణ అధ్యక్షుడు చుండూరి రోశయ్య, ఫ్లోర్ లీడర్ రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: