రూపాయి ఆస్తిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రూపాయి ఆస్తిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం

రూపాయి ఆస్తిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం

Written By news on Sunday, March 27, 2016 | 3/27/2016


చౌదరీ.. నిజాయితీ నిరూపించుకో
 మునిసిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలెన్ని కబ్జా చేశావు?
 మేము రూపాయి ఆస్తిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం
► మిస్సమ్మ స్థలం విషయంలో  ఆరోపణలు తగవు
► విచారణకు సిద్ధమా? మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి సవాల్


అనంతపురం : నగరంలోని మిస్సమ్మ స్థలం విషయంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి  రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ధ్వజమెత్తారు.  శనివారం ఆయన స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలపై గురునాథరెడ్డి తీవ్రంగా స్పందించారు. మిస్సమ్మ స్థలాన్ని కబ్జా చేశారంటూ అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. చౌదరి మునిసిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను అక్రమంగా అమ్ముకున్నారన్నారు. హౌసింగ్ సొసైటీ స్థలాలను ఆక్రమించారని తెలిపారు.

మిస్సమ్మ స్థలంపై విచారణకు గడువు పెట్టి మూడు రోజుల పాటు అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో తాము కూర్చున్నప్పటికీ ఏ ఒక్కరూ ముందుకు రాలేదన్నారు. ఆధారాలు లేకపోవడంతోనే రాలేకపోయారని చెప్పారు. మిస్సమ్మ స్థలం సీఎస్‌ఐకి చెందినదిగా సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందన్నారు. ఈ స్థలం అమ్మకానికి నోటిఫికేషన్ ఇచ్చారని, తమతో పాటు చాలామంది టెండరు దాఖలు చేశారని తెలిపారు. అధిక ధర కోట్ చేయడంతో తమకు దక్కిందన్నారు. తాము 30 ఏళ్లుగా అనంతపురం రాజకీయాల్లో ఉంటున్నామని, అన్యాయంగా ఒక్క రూపాయి ఆస్తిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటామని సవాల్ విసిరారు. తాను టీడీపీలో చేరుతున్నానంటూ దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. కుంభకోణాలకు కేరాఫ్‌గా మారిన, మునిగిపోయే నావలాంటి టీడీపీలో ఎవరు చేరుతారని ప్రశ్నించారు.

అనంతపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీని దెబ్బతీసేందుకు కుట్ర పన్నారన్నారు. చౌదరి ఒక బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తమకు ప్రాణమున్నంత వరకు  జగన్ వెంటే తమ కుటుంబం ఉంటుందని స్పష్టం చేశారు. నగరంలో ఎవరు అక్రమాలు, కబ్జాలు చేశారో బహిరంగ విచారణకు సిద్ధమా అని చౌదరికి సవాల్ విసిరారు. వేదిక నువ్వు చెప్పినా సరే...నేను చెప్పమన్నా  సరే అని అన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, బీసీ సెల్ నగర అధ్యక్షుడు శ్రీనివాసులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: