చినబాబు రాకపోతాడా.. దోమకు చప్పట్లు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చినబాబు రాకపోతాడా.. దోమకు చప్పట్లు!

చినబాబు రాకపోతాడా.. దోమకు చప్పట్లు!

Written By news on Thursday, March 17, 2016 | 3/17/2016


చినబాబు రాకపోతాడా.. దోమకు చప్పట్లు!
హైదరాబాద్ :
బడ్జెట్ మీద చర్చలో భాగంగా వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి సభలో నవ్వులు పూయించారు. సీరియస్ అంశాలకు కూడా సామెతలు, పిట్ట కథలు చెబుతూ మొత్తం సభలో అందరూ హాయిగా నవ్వుకునేలా చేశారు. ముందుగా 'నందోరాజా భవిష్యతి' కథను గుర్తుచేశారు. రైతు రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయంటే నందోరాజా భవిష్యతి, డ్వాక్రా రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయంటే నందోరాజా భవిష్యతి.. ఇలా ప్రతి అంశానికీ అదే మంత్రం పఠిస్తున్నారన్నారు. అది ఏంటంటే, రాజు గారికి ఇద్దరు భార్యలున్నారని, చిన్నభార్య కొడుకు నందుడని అన్నారు. చిన్న భార్యకు ఊళ్లో అన్నిచోట్లా అప్పులేనని, వాటిని ఎప్పుడు తీరుస్తారంటే.. ఏదో ఒక రోజు నందుడు రాజు కాకపోతాడా, అప్పులన్నీ తీర్చకపోతానా అన్నారన్నారు. అలాగే ఇప్పుడు కూడా ఏదో ఒకరోజు చినబాబు రాకపోతాడా.. రుణమాఫీ చేయకపోతామా, చినబాబు రాకపోతాడా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోతామా అన్నట్లు పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.

అలాగే, చివర్లో ఒక దోమ కథ కూడా వినిపించారు. పిల్ల దోమ పుట్టిన తర్వాత తొలిసారి ప్రపంచంలోకి వెళ్లి ఒక రోజంతా తిరిగి వచ్చిందని.. వచ్చిన తర్వాత దాని తల్లి దోమ, తండ్రి దోమ కలిసి ప్రపంచం ఎలా ఉందని అడిగారని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. దానికి పిల్ల దోమ.. ''నాకింత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని మీరు ఇంతవరకు చెప్పనే లేదు, నేను బయటకు వెళ్లగానే అందరూ చప్పట్లు కొడుతున్నారు'' అందని, మన ప్రభుత్వం తీరు కూడా అలాగే ఉందని అన్నారు. దీంతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరిశాయి.
Share this article :

0 comments: