ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతా

ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతా

Written By news on Monday, March 14, 2016 | 3/14/2016


'ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతా'
హైదరాబాద్: ఏ ఆధారాలతో తనపై బురద చల్లుతున్నారని అధికార పక్షాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తనపై కేసులు పెట్టారని సూటిగా ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేసిన ఆరోపణలపై వైఎస్ జగన్ స్పందించారు.

'కోర్టులు నన్ను దోషిగా ప్రకటించాయా? మరి నాపై ఏరకంగా 43 వేల కోట్ల ఆరోపణలు చేస్తున్నారు. ఏ ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నారు. కోర్టులో కేసులు విచారణలో ఉండగా ఎలా మాట్లాడతారు. ఏ ఆధారాలతో నాపై బురద చల్లుతున్నారు. నాపై కేసులు ఎవరు పెట్టారు. కాంగ్రెస్, చంద్రబాబు కలిసి నాపై కేసులు పెట్టారు. కాంగ్రెస్ లో ఉన్నంతవరకు నాపై ఆరోపణలు ఉన్నాయా. రూ. 43 వేల కోట్లలో పావలా వాటా ఇస్తే ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతా. అసెంబ్లీ కూడా నాదే అంటారు.

నల్లధనంతో ఎమ్మెల్యేలను కొనడానికి చంద్రబాబు ప్రయత్నించలేదా. ఆడియో, వీడియో టేపులతో పట్టుబడలేదా. ఆ రోజు ఎమ్మెల్సీ కొనుగోలు కోసం నల్లధనం వినియోగించలేదా. ఆ రోజు చంద్రబాబు ఖర్చుపెట్టింది బ్లాక్ మనీ కాదా. అవినీతి ద్వారా చంద్రబాబు ఆ డబ్బులు సంపాదించలేదా. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. 1978లో చంద్రబాబు రాజకీయ జీవితం మొదలు పెట్టినప్పుడు బాబు ఆస్తి ఎంత. అప్పుడు చంద్రబాబు ఆస్తి రెండెకరాలు కాదా. ఇప్పుడు రూ. 2లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. ఇవన్నీ కనిపించవా' అని వైఎస్ జగన్ నిలదీశారు.
Share this article :

0 comments: