ఆ తొమ్మిదేళ్లలో వేలకోట్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ తొమ్మిదేళ్లలో వేలకోట్లు

ఆ తొమ్మిదేళ్లలో వేలకోట్లు

Written By news on Tuesday, March 8, 2016 | 3/08/2016ఆ తొమ్మిదేళ్లలో వేలకోట్లు
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన అవినీతి, అక్రమాలకు, భారీ కుంభకోణాలకూ అసలు సిసలు ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోయింది. దేశంలో ఏ రాజకీయ నాయకుడిపైనా రానన్ని ఆరోపణలు వచ్చినా ఆయన ఏ మాత్రం పట్టించుకోకుండా అస్మదీయులకు భూములు, గనులు పంచిపెట్టారు. ప్రభుత్వ సంస్థలను దివాళా తీయించి తక్కువ ధరలకే కట్టబెట్టారు. అడుగడుగునా కుంభకోణాలకు పాల్పడ్డారు. బడుగులకు భరోసానిచ్చే పనికి ఆహార పథకాన్ని కూడా వదల్లేదు. పిల్లల స్కాలర్‌షిప్‌లలో కూడా అవినీతికి పాల్పడ్డారు. వాటర్‌షెడ్, నీరు-మీరు పథకాలు సైతం కుంభకోణాలుగా మార్చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థలను పథకం ప్రకారం దివాళా తీయించి అస్మదీయులకు అతి తక్కువ ధరలకు అమ్మేశారు. ఏలేరు కుంభకోణం వెలుగులోకి రాకుండా తొక్కేశారు. అంతేకాదు... ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఊరూపేరూలేని ఐఎంజీ భారత్‌కు 800 ఎకరాలు నిస్సిగ్గుగా అప్పగించిందీ ఆయనే. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్న వారికి దోచుకున్నట్లుగా తయారుచేశారు. మాదాపూర్‌లో హైటెక్ సిటీ నిర్మాణం నిర్ణయాన్ని ప్రకటించకుండా దాచిపెట్టి తన సన్నిహితుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరి సంస్థకు భారీగా లాభాలు వచ్చేలా సహకరించారు. మద్యం కొనుగోళ్లలో ప్రజాధనాన్ని మూడు లిక్కర్ కంపెనీలకు దోచిపెట్టారు. టీడీపీ ప్రభుత్వ అవినీతి కారణంగా 1997 నుంచి 2000 వరకు రూ.600కోట్లు గల్లంతయ్యాయని విజిలెన్స్ నివేదిక స్పష్టంగా పేర్కొంది. ఇక చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో కమీషన్లు లేకుండా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా అమలుకాలేదంటే  అతిశయోక్తి కాదు. తాను ముఖ్యమంత్రిగా 1995 సెప్టెంబర్ 1న ప్రమాణ స్వీకారం చేయగా సెప్టెంబర్ 5వ తేదీన మాదాపూర్‌లో 148 ఎకరాలను ఆ సంస్థకు దఖలు పరుస్తూ ఉత్తర్వులివ్వడం అందుకు నిదర్శనం. ఇలా తొమ్మిదేళ్ల చంద్రబాబు హయాంలో కుంభకోణాల వివరాలిలా ఉన్నాయి..
Share this article :

0 comments: