ప్రభుత్వ దోపిడీని ప్రజల ముందుంచాం: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వ దోపిడీని ప్రజల ముందుంచాం: వైఎస్ జగన్

ప్రభుత్వ దోపిడీని ప్రజల ముందుంచాం: వైఎస్ జగన్

Written By Unknown on Thursday, March 31, 2016 | 3/31/2016


ప్రభుత్వ దోపిడీని ప్రజల ముందుంచాం: వైఎస్ జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇప్పటికే ప్రభుత్వం మూడు బడ్జెట్ లు ప్రవేశపెట్టిందని, ఇక రెండు మాత్రమే మిగిలి ఉన్నాయని  ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. బడ్జెట్ సమావేశాలు జరిగిన పరిస్థితులు, బడ్జెట్ సమావేశంలో అంకెలు తదితర విషయాలపై మాట్లాడేందుకే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు వైస్ జగన్ తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో  ప్రధానంగా వైఎస్ఆర్ సీపీ తరఫు నుంచి గవర్నర్ స్పీచ్ మొదలుకొని, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడం, అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడం, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా కోర్టు తీర్పుతో పాటు పోలవరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలు, కరెంట్ ఛార్జీలు పెంపు తదితర అంశాలను సభలో ఎండగట్టడం, అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉండటం జరిగిందని ఆయన అన్నారు.  

రాజధాని ప్రాంత భూముల్లో ఇన్ సైడ్ ట్రేడింగ్ అంశాలను సభలో ప్రస్తావించినట్లు వైఎస్ జగన్ తెలిపారు. చంద్రబాబు ఓత్ ఆఫ్ సీక్రసీని ఎలా ఉల్లంఘించారో సభలో ఎండగట్టామని, నీకెంత-నాకెంత అంటూ ఇసుకలో రూ.2వేల కోట్లు దోచుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రెండేళ్లు ఎడాపెడా దోచుకుని ఇప్పుడు ఇసుక ఫ్రీ అంటున్నారని ధ్వజమెత్తారు.  సబ్ ప్లాన్ విషయంలో ఎస్సీ, ఎస్టీలను చంద్రబాబు సర్కార్  మోసం చేసిందన్నారు. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేయకపోవటంపై నిలదీయటం జరిగిందన్నారు. తాము అసెంబ్లీలో ఏం చెప్పామో కాగ్ కూడా అవే విషయాలు ధ్రువీకరించిందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లీస్తున్నారని, ఎస్టీ నిధులు 69 శాతం ఖర్చు చేయలేదన్నారు. ప్రభుత్వ విధానాలను కాగ్ తప్పబట్టిందన్నారు. దళితులను మోసం చేసిన చంద్రబాబుకు అంబేద్కర్ విగ్రహం పెట్టే హక్కు లేదన్నారు. అలాగే రాజధాని బినామీ భూదందాపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశామని వైఎస్ జగన్ తెలిపారు. రైతులకు బేషరతుగా రుణమాఫీ చేస్తామని చెప్పి, మూడో వంతు వడ్డీ కూడా చెల్లించలేదని వైఎస్ జగన్ అన్నారు. రుణాలు మాఫీ చేస్తానని చెప్పి డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు పంగనామాలు పెట్టారన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి కోటి 75 లక్షల కుటుంబాలను మోసం చేశారని, కేంద్రంలో మంత్రులు ఉన్నా నిధులు తీసుకు రావటం లేదన్నారు. పైగా ఏపీని స్కాముల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.


* ఎస్సీ సబ్ ప్లాన్ ప్రకారం రూ.4,778 కోట్లు ఖర్చు చేయాలి
* కానీ రూ.1504 కోట్లు ఖర్చు చేశారు
*ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం రూ.1886 కోట్లు ఖర్చు చేయాలి
* కానీ రూ.1126 కోట్లే ఖర్చు చేశారు
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీ అప్పులు రూ.97,123 కోట్లయితే 2016-17లో అప్పులు రూ.లక్షా 90వేల 513 కోట్లకు చేరాయి
*కోర్ డాష్ బోర్డు ప్రకారం వ్యయం మార్చి 11న రూ.68వేల 143 కోట్లయితే కేవలం 20 రోజుల్లో రూ.32 వేలకోట్లు ఖర్చు చేశారు
Share this article :

0 comments: