ఏపీలో అయితే కుక్కపై కేసు పెట్టేవారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏపీలో అయితే కుక్కపై కేసు పెట్టేవారు

ఏపీలో అయితే కుక్కపై కేసు పెట్టేవారు

Written By news on Monday, March 7, 2016 | 3/07/2016


'ఏపీలో అయితే కుక్కపై కేసు పెట్టేవారు'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మహిళలంటే చులకనని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. మహిళలను వేధించేవారికి ఆయన అండగా ఉంటున్నారని ఆరోపించారు. మంగళవారం మీడియా సమావేశంలో రోజా మాట్లాడుతూ.. చంద్రబాబుకు మహిళా దినోత్సవాన్ని జరుపుకొనే అర్హత లేదని అన్నారు. ఆమె ఏం మాట్లాడారంటే..
 • మహిళలంటే చంద్రబాబుకు ఎంత చులకనో అందరికీ తెలుసు
 • ఢిల్లీలో మాట్లాడినప్పుడు.. కోడలు మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా అన్నారు
 • ఆడపిల్లలంటే ఆయనకు అంత అలుసన్న మాట
 • ఎన్నికల ముందు ప్రకటనలు చూసి మహిళలకు భద్రత ఉంటుందనుకుని ఓట్లు వేశారు
 • కానీ రాష్ట్రంలో కీచకపాలన జరుగుతోంది
 • 23 నెలల్లో ఎందరు మహిళలు ఏడుస్తున్నారో కళ్లారా చూస్తున్నాం
 • ఈ కీచకులందరికీ మెంటార్ చంద్రబాబు, ఆయన వారసుడు లోకేశ్
 • మొన్న భూముల విషయంలో చూస్తే, డబ్బులున్నాయి, కొనుక్కున్నారన్నారు
 • అమ్మాయిల విషయంలో కూడా వాళ్ల మాటలు అలాగే ఉంటున్నాయి
 • లోకేష్ తప్పతాగి అమ్మాయిలతో తిరిగారు
 • వాళ్ల మామగారు అమ్మాయిల గురించి దారుణంగా మాట్లాడారు
 • వాళ్లిద్దరూ చేయగా లేనిది తాము చేస్తే తప్పేంటని టీడీపీ నేతలు అనుకుంటున్నారు
 • వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టిన చింతమనేనికి చంద్రబాబు అండ ఉంది కదా
 • బుద్దా వెంకన్న, బోడే ప్రసాద్, బోండా ఉమా అనుచరులు మహిళలను వేధించారు
 • మంత్రి రావెల కిశోర్ కొడుకు సుశీల్ చిత్తకార్తె కుక్కలా ఓ వివాహితను కారులోకి లాగి అఘాయిత్యం చేయాలనుకున్నాడు
 • మంత్రి ప్రెస్‌మీట్ పెట్టి జగన్ కుట్ర ఉందన్నారు
 • అంటే జగన్ అక్కడ సీసీ కెమెరాలు పెట్టారా, లేక బురఖాలో జగన్ వెళ్లారా, లేక చేయి పట్టుకుని లాగమని సుశీల్‌కు చెప్పారా?
 • ఈ వార్త మొదట వచ్చింది టీవీ 9, ఎన్టీవీ చానళ్లలో వచ్చింది
 • లోకేశ్‌కు కూడా తాగి అమ్మాయిలతో డాన్సులు వేయమని జగన్ చెప్పారని అన్నా అంటారు
 • తెలంగాణ కాబట్టి రావెల సుశీల్‌ను స్థానికులు పట్టుకుని కొట్టి, కేసు పెట్టించారు.
 • అదే ఆంధ్రప్రదేశ్‌లో జరిగి ఉంటే కుక్క మీద కేసు పెట్టి ఉండేవాళ్లు
 • ఇంతకన్నా సిగ్గుమాలిన ప్రభుత్వం ఉందా?
 • ఇలాంటి మంత్రిని సస్పెండ్ చేయకుండా మహిళా దినోత్సవం జరుపుకొనే నైతిక అర్హత ఉందా చంద్రబాబూ అని ప్రశ్నిస్తున్నాను
 • ఏ మొహం పెట్టుకుని కర్నూలులో మహిళా దినోత్సవం జరుపుకొంటారు?
 • కిషోర్ పదవి తీసేయాలి, చింతమనేనిని సస్పెండ్ చేయాలి, బోండా ఉమా లాంటివాళ్లను ఎమ్మెల్యేలుగా తప్పించారు
 • నారాయణ కాలేజిలో 18 మంది పిల్లలు మరణిస్తే, ఆయన మంత్రి పదవి కూడా తీయలేదు. అవేవీ చేయకుండా మహిళా దినోత్సవం చేసుకునే అర్హత లేదు
 • మైనర్ బాలిక ఇందుమతి మీద కిరోసిన్ పోసి చంపేస్తే.. టీడీపీ మహిళా ప్రతినిధులు కనీసం ఆ కుటుంబాన్ని పలకరించారా?
Share this article :

0 comments: