మీ కొడుకు తప్పు చేస్తే.. వైఎస్ జగన్ కు ఏం సంబంధం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీ కొడుకు తప్పు చేస్తే.. వైఎస్ జగన్ కు ఏం సంబంధం

మీ కొడుకు తప్పు చేస్తే.. వైఎస్ జగన్ కు ఏం సంబంధం

Written By news on Sunday, March 6, 2016 | 3/06/2016


'మీ కొడుకు తప్పు చేస్తే.. వైఎస్ జగన్ కు ఏం సంబంధం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు కొడుకు సుశీల్ తప్పు చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏం సంబంధమని ఆ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ప్రశ్నించారు. వైఎస్ జగన్ గురించి మంత్రి పదేపదే మాట్లాడటం అవివేకమని.. ఆదివారం మీడియా సమావేశంలో అన్నారు. మంత్రి కొడుకు బాధిత మహిళను వేధించిన దృశ్యం వీడియో ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. అయినా రావెల కిశోర్ బాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.  మంత్రి తన కుమారుడికి బుద్ధి చెప్పకుండా కేసును వక్రీకరిస్తున్నారని, ప్రతిపక్షాలను తప్పుపడుతున్నారని అన్నారు.

ఫుటేజీని మార్ఫింగ్ చేశారని మంత్రి కిశోర్ బాబు చెప్పడం దుర్మార్గమని ఉప్పులేటి కల్పన అన్నారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలకు మహిళలపై ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. చంద్రబాబు వియ్యంకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఓ ఆడియో విడుదల కార్యక్రమంలో మహిళల గురించి నీచంగా మాట్లాడరని చెప్పారు. అమ్మాయి కనిపిస్తే ముద్దయినా పెట్టాలని, లేదంటే కడుపయినా చేయాలని బాలకృష్ణ అన్నారని, ఓ ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది అంటూ నిలదీశారు.
Share this article :

0 comments: