చంద్రబాబుపై సభాహక్కుల ఉల్లంఘన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుపై సభాహక్కుల ఉల్లంఘన

చంద్రబాబుపై సభాహక్కుల ఉల్లంఘన

Written By news on Friday, March 18, 2016 | 3/18/2016


హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ముగ్గురు మంత్రులపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘటన నోటీసు ఇచ్చారు. శుక్రవారం శాసనసభ కార్యదర్శిని కలిసి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు నోటీసులు అందజేశారు. సీఎంతో పాటు మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు.

బడ్జెట్ సమర్పణ, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానం సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు తమపై సీఎం, మంత్రులు దూషణలకు దిగారని తెలిపారు. మరోవైపు ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యవహారంపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ రేపు(శనివారం) అత్యవసరంగా భేటీ కానుంది.
Share this article :

0 comments: