అంతా అభూత కల్పనలే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అంతా అభూత కల్పనలే

అంతా అభూత కల్పనలే

Written By news on Friday, March 11, 2016 | 3/11/2016


అంతా అభూత కల్పనలే
బడ్జెట్‌పై పెదవి విరిచిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
రుణాలు ఎక్కువ తీసుకోవచ్చనే ఆశతోనే జీఎస్‌డీపీని ఎక్కువ చేసి చూపారు
వడ్డీలేని, పావలా వడ్డీ రుణాలకు రూ.177 కోట్లా?
రైతుల రుణమాఫీకి కేటాయించేది రూ. 3,500 కోట్లేనా?
వడ్డీలో మూడో వంతు మొత్తం కూడా కాదు
గత ఏడాది, ప్రస్తుత బడ్జెట్ అంచనాల్లో మార్పులేదు
కేంద్ర పన్నుల నుంచి వచ్చే రాష్ట్ర వాటా మాత్రమే మారింది

సాక్షి, హైదరాబాద్ : 2016-17 రాష్ట్ర బడ్జెట్ మొత్తం అభూత కల్పనలేనని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గురువారం శాసనసభలో ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్‌పై తన చాంబర్‌లో విలేకరులడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానమిచ్చారు. బడ్జెట్ అంత ఆశాజనకంగా ఏమీ లేదని పెదవి విరిచారు. ఇది ప్రజా బడ్జెట్ అని అధికారపక్షం పేర్కొనడం సరికాదన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడి రుణం తెచ్చుకోవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు (జీఎస్‌డీపీ)ని 10.99గా చూపించారని ఆక్షేపించారు. జీడీపీ రూ.6 లక్షల కోట్లు చూపించారని, దానివల్ల రూ. 20 వేల కోట్ల మేరకు రుణం తెచ్చుకునే సదుపాయం ఉంటుందని తెలిపారు. అందుకే రాబడులకు సంబంధించిన వివరాలను కూడా లేనివి ఉన్నట్లుగా చూపించారని విమర్శించారు. జీఎస్‌డీపీ ఎక్కువ చూపిస్తే రుణాలు ఎక్కువ  తెచ్చుకోవచ్చని ఆశపడ్డారని తెలిపారు.
 
వడ్డీలేని, పావలా వడ్డీ రుణాలకు రూ.177 కోట్లా?
రైతులకు ఇచ్చే వడ్డీలేని, పావలా వడ్డీ రుణాలకు  రూ. 177 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమని జగన్ దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ పథకానికి ఈ ఏడాది కూడా రూ.3,500 కోట్లు మాత్రమే కేటాయించడం మరీ అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబునాయుడు సీఎం అయ్యేనాటికి ఉండిన రైతుల రుణాలు రూ.87,612 కోట్లు. ఈ రెండేళ్లకే ఆ మొత్తం మీద వడ్డీయే రూ.25,000 కోట్లు అయ్యింది.

ఈ ఏడాది కూడా కలుపుకుంటే మొత్తం 36 నెలలకు గాను సుమారు రూ 40,000 కోట్లకు అటూ ఇటూగా వడ్డీ పెరుగుతుంది. వడ్డీయే ఇంత మొత్తం ఉంటే ైరె తుల రుణమాఫీకి గాను ఇప్పటివరకూ ప్రభుత్వం ఇచ్చింది మొత్తం రూ.7,400 కోట్లే. ఈ ఏడాది రూ. 3,500 కోట్లు ఇస్తామంటున్నారు’’ అని చెప్పారు. ఇదంతా కలిపినా రుణాలపై వడ్డీలో మూడో వంతు మొత్తం కూడా కాదని ఆయన విమర్శించారు.
 
అంచనాలు.. సవరించిన అంచనాలు రెండూ మారలేదు
కోర్ డాష్ బోర్డులో పెట్టిన దాంట్లోనే సగటున నెలకు రూ.3,500 కోట్లు రాబడులుంటాయని పేర్కొన్నారని, ఆ ప్రకారం పన్నుల ద్వారా వచ్చే రాబడి, పన్నేతర మార్గాల నుంచి వచ్చే రాష్ట్ర రాబడి మొత్తం రూ.42వేల కోట్లుగా ఉంటుందని జగన్ తెలిపారు. 2015-16 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాల్లో మార్పే లేదన్నారు. కేంద్ర పన్నుల నుంచి వచ్చే రాష్ట్ర వాటా మాత్రమే మారిందని తెలిపారు.

కేంద్ర బడ్జెట్‌లో రూ.22,637 కోట్లు చూపిస్తే... రాష్ట్రంలో రూ.21,893 కోట్లు చూపించారని, మిగిలిన వాటిల్లో ఒక్కటంటే ఒక్కటి మార్చలేదని విమర్శించారు. కోర్ డాష్‌బోర్డులో ఏ మేరకు రాబడులు (రెవెన్యూ) వచ్చాయనేది కనిపిస్తూ ఉన్నా, సవరించిన అంచనాల్లో సుమారు రూ.50 వేల కోట్లు చూపించారని చెప్పారు. ఈ మొత్తం రూ.44,423 కోట్లు (ట్యాక్స్), రూ.5,341 కోట్లు (నాన్‌ట్యాక్స్) రెవెన్యూగా ఉందన్నారు. బడ్జెట్ పుస్తకాన్ని విలేకరులకు చూపిస్తూ... ఇందులో 2014-15 సంబంధించిన కార్యాచరణను కూడా చూపించలేదన్నారు. ఎంతయితే రాబడులు వచ్చాయో అవే చూపించాల్సి ఉంటుంది కనుక ఆ కాలమే ఎత్తేశారని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా తప్ప బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాలు రెండూ ఒకే మాదిరిగా ఉన్నాయని ఆయన తెలిపారు.
 
బీసీలకు కేటాయింపులు తక్కువే...
వెనుకబడిన తరగతుల వారికి రూ.30 వేల కోట్లు ఇవ్వాలని జగన్ అభిప్రాయపడ్డారు. ‘‘అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర తొలి ఏడాది బీసీల సంక్షేమానికి రూ 2,200 కోట్లు కేటాయించామన్నారు. రెండో సంవత్సరం రూ 2,700 కోట్లు కేటాయించామన్నారు. ఈ రెండూ కలిపితే రూ 5,000 కోట్లు అవుతుంది. ఈ ఏడాదిలో రూ 4,800 కోట్లు పెట్టామని చెప్పారు. దీన్ని బట్టి బీసీల సంక్షేమంపై వారికెంత శ్రద్ధ ఉందో అర్థం అవుతుంది’’ అని ఆయన చెప్పారు.
Share this article :

0 comments: