బడ్జెట్ అంతా అభూత కల్పన: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బడ్జెట్ అంతా అభూత కల్పన: వైఎస్ జగన్

బడ్జెట్ అంతా అభూత కల్పన: వైఎస్ జగన్

Written By news on Thursday, March 10, 2016 | 3/10/2016


బడ్జెట్ అంతా అభూత కల్పన: వైఎస్ జగన్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ పై ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెదవి విరిచారు. అసెంబ్లీ సోమవారానికి వాయిదా అనంతరం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. బడ్జెట్ అంతా అభూత కల్పనే అని, వ్యవసాయ కేటాయింపులు దారుణమని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
 
రుణమాఫీకి కేటాయించిన నిధులు వడ్డీలో మూడో వంతుకు సరిపోవని ఆయన అన్నారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్, బడ్జెట్ ఎస్టిమేట్స్ ఒకేలా ఉన్నాయన్నారు. బీసీలు, కాపులకు కేటాయింపులు సరిగా లేవని, గతంలో చెప్పినదానికి, ఇప్పుడు కేటాయించిన దానికి పొంతన లేదని వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేశారు.
Share this article :

0 comments: