రాజధానిలో భూదందా నిజమే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజధానిలో భూదందా నిజమే

రాజధానిలో భూదందా నిజమే

Written By news on Monday, March 7, 2016 | 3/07/2016


రాజధానిలో భూదందా నిజమే
చంద్రబాబు మాటలను బట్టి స్పష్టమవుతోంది: ఎమ్మెల్సీ కోలగట్ల

హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అన్యాయంగా, అక్రమంగా భూములను కొనుగోలు చేయడం నిజమేనన్న విషయం సీఎం చంద్రబాబు మీడియాలో వెల్లడించిన మాటలను బట్టి స్పష్టమవుతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వేమూరు రవికుమార్ అనే ప్రవాసుడు రాజధాని ప్రకటన వెలువడటానికి ముందే భూములు కొనుగోలు చేశారని, అలాగే టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్ సొంత డబ్బుతో భూమి కొన్నారంటూ చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకే అధికార పార్టీ నేతలు అక్కడ భూములు కొనుగోలు చేశారని కోలగట్ల ఆరోపించారు. లింగమనేని స్వయంగా తన వద్దకు వచ్చి ల్యాండ్‌పూలింగ్‌లో తన భూమిని తీసుకోవాలని కోరితే వద్దని వారించానంటూ చంద్రబాబు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు.

అవి వట్టిపోయిన పశువులు : తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు వలసవెళ్తే సంతలో పశువుల్లాగా కొంటున్నారని పశువులతో పోల్చిన చంద్రబాబు ఇప్పుడు ఏపీలో తన మందలో పశువులు తక్కువయ్యాయని ఎమ్మెల్యేలను కొంటున్నారా? అని కోలగట్ల వీరభద్రస్వామి మండిపడ్డారు. చంద్రబాబు కొంటున్నవి వట్టిపోయిన పశువులే అనేది వచ్చే ఎన్నికల్లో తేలిపోతుందన్నారు.
Share this article :

0 comments: