ఇప్పుడు రిజెక్ట్ చేయడం ధర్మం కాదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇప్పుడు రిజెక్ట్ చేయడం ధర్మం కాదు

ఇప్పుడు రిజెక్ట్ చేయడం ధర్మం కాదు

Written By news on Tuesday, March 29, 2016 | 3/29/2016


'ఇప్పుడు రిజెక్ట్ చేయడం ధర్మం కాదు'
హైదరాబాద్: మూడున్నరేళ్లుగా రైతులకు బీమా ఎందుకు ఇవ్వడం లేదని ఇన్సూరెన్స్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. 2012-13 పంటల బీమా కోసం రైతులు బషీర్ బాగ్ లోని ఇన్సూరెన్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అన్నదాతల ఆందోళనకు వైఎస్ జగన్ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2012 నుంచి రబీ పంటకు బీమా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీమియం చెల్లించినా బీమా మంజూరు చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 85 వేల మంది బీమా కడితే మూడున్నరేళ్ల తర్వాత 29 వేల మందికి మాత్రమే ఇన్సూరెన్స్ ఇచ్చారని తెలిపారు. బీమా కింద మంజూరు చేసిన రూ.135 కోట్లలో రూ.105 కోట్లు మాత్రమే ఇచ్చి మిగిలింది పెండింగ్ లో ఉంచారని వెల్లడించారు. మిగతా 26 వేల మందికి ఎందుకు ఇన్సూరెన్స్  ఇవ్వడం లేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు.

దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే రెండుమూడు నెలల్లోనే చెప్పాలని, మూడున్నరేళ్ల తర్వాత దరఖాస్తులను తిరస్కరించడం ధర్మం కాదని అన్నారు. రైతులకు అండగా నిలవాలని బీమా సంస్థను కోరారు. బీమా ఇవ్వడమే ఆలస్యంగా ఇస్తున్నారని, ఇప్పుడు అదిలేదు.. ఇదిలేదు అంటూ రైతులను ఇబ్బందులకు గురిచేయడం భావ్యం కాదన్నారు. దీనిపై అసెంబ్లీలోనూ మాట్లాడామని గుర్తు చేశారు. నెల రోజుల్లోగా రైతులకు బీమా ఇవ్వాలని, లేకుంటే మళ్లీ ఆందోళనకు దిగుతామని వైఎస్ జగన్ హెచ్చరించారు. వైఎస్ జగన్ తో పాటు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రైతులకు మద్దతు తెలిపారు
Share this article :

0 comments: