సావిత్రి సినిమా ఆడియో ఫంక్షన్‌లో బాలయ్య వ్యాఖ్యలు
ఆయన తీరుపై సామాజిక మాధ్యమాల్లో భగ్గుమన్న నెటిజన్లు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వియ్యంకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరుపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు మండిపడుతున్నారు. నారా రోహిత్ హీరోగా నటించిన సావిత్రి సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా బాలకృష్ణ ప్రసంగంలో అసభ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘అమ్మాయిల వెంటపడే పాత్రలు నేను చేస్తే ఒప్పకోరు కదా. ముద్దైనా పెట్టాలి... లేదా కడుపైనా చేయాలి. అంతే.. కమిట్ అయిపోవాలి..’’ అని వ్యాఖ్యానించారు. ఇక నారా రోహిత్ గురించి ‘సచ్ ఏ నైస్ కో ఆర్టిస్ట్’ అంటూ చిత్ర కథానాయిక నందిత పేర్కొన్న సంగతిని ప్రస్తావిస్తూ.. ‘‘మా పోలికలు కొద్దిగా అయినా రావాలి. గిల్లడాలు, పొడవడాలు.. నేను ఎక్కని ఎత్తుల్లేవు.. చూడని లోతుల్లేవు..’’ అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఫేస్‌బుక్, ట్వీటర్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధిగా ఉండటానికి బాలకృష్ణ అనర్హుడంటూ అనంతపురం జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి మురళీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధి పది మందికి ఆదర్శంగా ఉండాలే తప్ప సమాజానికి చీడపురుగులుగా మారవద్దంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. బాలకృష్ణ ఉపన్యాసాన్ని యథాతథంగా పెట్టి ‘ఈయన ప్రజా ప్రతినిధా?’ అంటూ చేసిన పోస్టింగ్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ముద్దులు పెట్టడం, కడుపులు చేయడమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను హైదరాబాద్‌కు చెందిన మంజుల తీవ్రంగా తప్పుపట్టారు. మంత్రి రావెల కిషోర్ తనయుడు సుశీల్‌కు బాలకృష్ణకు తేడా లేదంటూ మండిపడ్డారు. గిల్లడాలు, పొడవడాలు అంటూ మహిళాలోకాన్ని బాలకృష్ణ కించపరిచిన తీరుపైనా ఫేస్‌బుక్‌లో తీవ్రమైన విమర్శలు సంధించారు. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేసి మహిళా లోకాన్ని అవమానించారని విజయవాడకు చెందిన ఎస్.శ్యామల ధ్వజమెత్తారు. ‘నేను రాత్రి ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌ను టీవీలో చూస్తుండగా బాలకృష్ణ పచ్చి బూతులు మాట్లాడారు. ఛీ.. ఛీ.. ఛీ’ అని ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఇలాంటి వారిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు హిందూపురం ప్రజలు సిగ్గుపడాలి అని బెంగళూరుకు చెందిన సునీతారెడ్డి వ్యాఖ్యానించారు.

http://www.sakshi.com/news/hyderabad/netizens-fires-on-balakrishna-comments-in-audio-function-320360?pfrom=home-top-story
0 comments:
Post a Comment