రాజధానిలో భూములకు సంబందించి వెబ్ సైట్ ఎందుకు స్తంభింప చేశారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజధానిలో భూములకు సంబందించి వెబ్ సైట్ ఎందుకు స్తంభింప చేశారు?

రాజధానిలో భూములకు సంబందించి వెబ్ సైట్ ఎందుకు స్తంభింప చేశారు?

Written By news on Thursday, March 3, 2016 | 3/03/2016

రాజధానిలో రైతుల భూములు తీసుకుని ,టిడిపి నేతలు వ్యాపారం చేసుకుంటున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.రాజధానిలో భూములకు సంబందించి వెబ్ సైట్ ఎందుకు స్తంభింప చేశారని ఆమె ప్రశ్నించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్ కు ఆయన నానమ్మ హైదరాబాద్ మదీనాగూడలో ఐదెకరాల బూమి ఎలా ఇచ్చిందని రోజా అన్నారు.మంత్రి నారాయణపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఏనాడైనా ఆయన టిడిపి జెండా మోశారా అని ప్రశ్నించారు.ఆయన తన కాలేజీలలో పనిచేసే చిరుద్యోగుల తో భూములు కొనుగోలు చేశారని ఆమె ఆరోపించారు.సాక్షిపత్రికపై దావా వేస్తామని మంత్రులు చెప్పారని, ఇప్పుడు మరిన్ని ఆధారాలతో వార్తలు వచ్చాయని, వీటిపై విచారణ కు మంత్రులు సిద్దం అవుతారా అని రోజా ప్రశ్నించారు.లాండ్ పూలింగ్ లో రెవెన్యూ మంత్రిని ఎందుకు బాగస్వామిని చేయలేదని ఆమె అడిగారు. స్పీకర్ కోడెల కుమారుడు పిఎ 17 ఎకరాల బూమి ఎలా కొన్నారని ఆమె అన్నారు.చంద్రబాబు అక్రమ భవనంలో ఉన్న మాట వాస్తవం కాదా అని రోజా అన్నారు.మంత్రి పత్తిపాటి పుల్లారావు భార్య పేరుతో అగ్రిగోల్డ్ సంస్థ భూమిని కొన్నారని , ఆయన స్నేహితులు ఎలా రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారని అన్నారు.చంద్రబాబు తనకు నిజాయితీ ఉందని, తాను నిప్పు అని చెప్పుకోవడం కాదని, రాజధాని భూములపై నోరు విప్పాలని రోజా డిమాండ్ చేశారు. దమ్ముదైర్యం ఉంటే సిటింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: