ఎమ్మెల్యేలను రోడ్డుపై నిలబెడతారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎమ్మెల్యేలను రోడ్డుపై నిలబెడతారా?

ఎమ్మెల్యేలను రోడ్డుపై నిలబెడతారా?

Written By news on Friday, March 18, 2016 | 3/18/2016


'ఎమ్మెల్యేలను రోడ్డుపై నిలబెడతారా?'
హైదరాబాద్: ఒక ఎమ్మెల్యేను ఎల్పీ ఆఫీసులోకి కూడా అనుమతించరా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఒక వేళ అలా అనుమతి లేదని స్పీకర్ ఆదేశాలు రాతపూర్వకంగా ఉంటే చూపించండి అంటూ ఆయన నిలదీశారు.

కోర్టు ఉత్తర్వుల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెను సభలోకి అనుమతించబోమంటూ చీఫ్ మార్షల్ చెప్పారు. దీంతో అదే సమయంలో వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. చీఫ్ మార్షల్ తీరుపట్ల మండిపడ్డారు. ఎమ్మెల్యేలను రోడ్డుమీద నిలబెడతారా అని ప్రశ్నించారు. స్పీకర్ ఆదేశాలు చూపించేవరకు మా ఎల్పీ ఆఫీసులోకి అనుమతించండి కోరారు. తన కార్యాలయంలోకి రోజాను తీసుకెళతానని, తన పాస్ కూడా ఇస్తానని చెప్పారు. తనకు ఎవరినైనా తీసుకెళ్లే హక్కు ఉందని వైఎస్ జగన్ మార్షల్స్ కు చెప్పారు. చివరకు తన పాస్ ఇచ్చి, తన వాహనంలో ఆయన ఎమ్మెల్యే రోజాను వైఎస్ఆర్‌సీఎల్పీ కార్యాలయంలోకి తీసుకెళ్లారు.

ఇంకా ఎవరేమన్నారంటే..
'కోర్టు ఇచ్చిన నిర్ణయాలను కూడా తుంగలోకి తొక్కి, ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడం హేయమైన చర్య. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది. నియోజకవర్గ ప్రజాసమస్యలు వినిపించేందుకు వెళ్లొచ్చని హైకోర్టు చెప్పినా, అడ్డుకుంటున్నారు.
సభ లోపల, బయట ప్రతిపక్షం గొంతు ఎలా నొక్కుతున్నారో స్పష్టంగా కనిపిస్తోంది.
-చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

చంద్రబాబు, స్పీకర్ తమ ఇష్టం వచ్చినట్లు ఎమ్మెల్యేను అడ్డుకుంటున్నారు. కనీసం సీఎల్పీ ఆఫీసు వరకు వెళ్లేందుకు కూడా వీల్లేకుండా అడ్డుకుంటున్నారు. హైకోర్టు ఉత్తర్వులను కూడా కాదంటున్నారు.
-ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)

'చాలా దుర్మార్గంగా చేస్తున్నారు. కోర్టు ఆర్డర్ తీసుకొచ్చినా కూడా లోపలకు పంపకుండా అడ్డుకుంటున్నారు. అందుకే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మేం అందరం కూడా అసెంబ్లీ బయటే బైఠాయించాం
- ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి

వీరితో పాటు వైఎస్ఆర్‌సీపీకి చెందిన గిరిజన ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర కూడా ఇదే అంశంపై మాట్లాడుతుండగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఆయనను పక్కకు నెట్టేయడంతో పాటు మీడియాను కూడా లాగేశారు. కనీసం ఆయనను మాట్లాడేందుకు కూడా అనుమతించలేదు.
Share this article :

0 comments: