ఏపీ బడ్జెట్ అంకెల గారడీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏపీ బడ్జెట్ అంకెల గారడీ

ఏపీ బడ్జెట్ అంకెల గారడీ

Written By news on Monday, March 14, 2016 | 3/14/2016

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి అవాస్తవాలతో కూడుకున్నదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత బడ్జెట్ పై చర్చలో మాట్లాడుతూ.. 'ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రయోజనాలను ముందుకుతీసుకెళ్లేది కాదు. విభజన తర్వాతి పరిస్థితిలో ఈ బడ్జెట్ రాష్ట్రానికి గుదిబండగా మారే ప్రమాదముంది. ఆర్థిక వ్యూహం రాష్ట్రానికి ప్రమాదం తెచ్చేలా ఉంది. రాష్ట్ర అప్పులు వచ్చే సంవత్సరంనాటికి 1,96,000 కోట్లకు చేరుతాయని అంటున్నారు. బడ్జెట్ 20 శాతం పెరిగినా, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అన్నింటికీ నిధులు తగ్గించేశారు' అని చెప్పారు.

ఈ బడ్జెట్ అంకెల గారడీ అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. 'మనం 11 శాతం జీడీపీ వృద్ధిరేటు సాధించామని చెబుతున్నారు. చంద్రబాబు అవినీతి, అన్యాయాలు, దోపిడీ వల్ల పంట విస్తీర్ణం తగ్గిపోయింది. వ్యవసాయ రంగం కుదేలైపోయింది. ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి వచ్చిన పాపాన పోలేదు. వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి బాగా పెరిగితేనే జీఎస్‌డీపీ పెరుగుతుంది. ఆ రెండు రంగాలూ కుంటుపడినా కూడా జీఎస్‌డీపీ పెరిగిందనడం పూర్తిగా తప్పు. ఓటుకు కోట్ల కేసులో దొరికిపోయిన ముఖ్యమంత్రి అవాస్తవాలు చెబుతూ మభ్యపెడుతున్నారు' అని చెప్పారు.
Share this article :

0 comments: