బాబుది అంతర్జాతీయ దొంగలముఠా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబుది అంతర్జాతీయ దొంగలముఠా

బాబుది అంతర్జాతీయ దొంగలముఠా

Written By news on Thursday, March 3, 2016 | 3/03/2016


బాబుది అంతర్జాతీయ దొంగలముఠా
కేంద్రం నిధులనుపక్కదారిపట్టిస్తున్న సీఎం
జన్మభూమి కమిటీలతోబ్యాంకులు దివాలా
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి



కోవూరు: సీఎం చంద్రబాబునాయుడు తనతో పాటున్న తొమ్మిది మంది అంతర్జాతీయ దొంగల ముఠాగా మారారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. గంగవరంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలు సన్న, చిన్నకారు రైతులను ఈ దొంగలముఠా బెదిరించి భూముల్ని కారుచౌకగా కొనుగోలు చేసిందన్నారు.అమరావతి చుట్టూ వేలాది ఎకరాల్ని బినామీ పేర్లతో ఈ ముఠా కొనుగోలు చేసిందన్నారు. భూములు ఇచ్చేది లేదంటూ రైతులు అడ్డం తిరిగితే వారిని బెదిరించి లాక్కున్నారన్నా రు. జిల్లా మంత్రి నారాయణ ఒక్కరే 3,500 ఎకరాలు కొన్నారంటే ఎంత పెద్ద కుంభకోణం జరిగిందో అర్థమ తోందన్నారు. ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే వీటిపైన సీబీఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాల న్నారు.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను రాష్ట్ర ఖజానాలోకి మార్చి చంద్రబాబునాయుడు పంచాయతీల మౌలిక వసతులకు అడ్డుకట్టవేశారన్నారు. గంగవరం గ్రామంలో తిరుపతిరెడ్డి నివాసంలో ప్రసన్న మాట్లాడారు. పంచాయతీల్లో మౌలిక వసతులకు ఉపయోగించాల్సిన నిధులను పక్కదారి పట్టించడం సరికాదన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లను చంద్రబాబు పక్కనపెట్టి జన్మభూమి కమిటీల హవా సాగించేలా చేయ డం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. జన్మభూమి కమిటీలతో ప్రజాప్రతినిధులకు విలువలేకుండాపోయిందని,ఆ కమిటీల కారణంగా బ్యాం కులు దివాలా తీస్తున్నాయని బ్యాంకు అధికారులే బహిరంగంగా చెబుతున్నారన్నారు.

కమిటీ సభ్యులు క్యాన్సర్  కన్నా ప్రమాదంగా తయారయ్యారని పశ్చిమ గోదావరి జిల్లా సమావేశంలో అక్కడి లీడ్ బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం చెప్పడం అందుకు నిదర్శనమన్నారు. రుణాలు సక్రమంగా కట్టని వారికి తిరిగి మంజూరు చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, ఇలాగే ఉంటే    కొద్ది రోజులకు బ్యాం కులు దివాలా తీస్తాయని  సుబ్రహ్మణ్యం చెప్పడాన్ని చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోందన్నారు.
పెంచిన వేతనాల అమలేదీ?

స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు  2015  జూన్ 8వ తేదీ న గౌరవ వేతనాలు పెంచుతూ విడుదల చేసిన జీఓ నేటికీ అమలుకాలేదన్నారు. ప్రస్తుతం ఉన్న సర్పంచుల్లో ఎస్సీ, ఎస్టీ,  బీసీ మైనార్టీ, ఓసీలు అధికంగా ఉన్నారన్నారు. వీరిలో కూడా ఆర్థికంగా వెనుకబడిన వారు ఎంతోమంది ఉన్నార ని, కార్యక్రమాలు చేసి అప్పులు పాలవుతున్నారన్నారు. జిల్లా కోశాధికారి పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు సుబ్బారెడ్డి, అనుబంధాల సంఘాల నాయకులు మల్లిఖార్జునరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, మధురెడ్డి, సుధాకర్‌రెడ్డి, సుబ్బరాయుడు  ఉన్నారు.
Share this article :

0 comments: